రైతుల ధర్నాతో.. | - | Sakshi
Sakshi News home page

రైతుల ధర్నాతో..

Oct 4 2026 9:31 AM | Updated on Oct 4 2026 9:31 AM

జూరాల ప్రాజెక్టు కింద సాగునీటి సరఫరాలో అంతరాయం తలెత్తి పంటలు దెబ్బతినే పరిస్థితి తలెత్తడంతో రైతులు గతనెలలో పలుమార్లు రోడెక్కి ధర్నా చేశారు. చివరికి జూరాల కాల్వ గేట్లు సైతం తెరిచి నీటిని విడుదల చేసుకోవడంతో ప్రభుత్వంలో ఒక్కసారిగా ఆందోళన నెలకొంది. పరిస్థితిని అధిగమించేందుకు సీఎం రేవంత్‌రెడ్డి స్పందించారు. జూరాల ఆయకట్టు పంటలను కాపాడేందుకు కర్ణాటక సీఎంతో మాట్లాడి ఒప్పించాలని మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటీ శ్రీహరిలను పురమాయించారు. దీంతో వారు గత నెల 22న ఉమ్మడి జిల్లాలోని పలువురు ఎమ్మెల్యేలతో కలిసి కర్ణాటక వెళ్లారు. 23న సీఎం డీకే శివకుమార్‌, ఇరిగేషన్‌ శాఖ మంత్రి షర్వ రాజస్వామి, ప్రిన్సిపల్‌ సెక్రెటరీ షాల్వాతో మంతనాలు జరిపారు. జూరాల కింద సాగైన పంటల పరిస్థితిని వివరించి మొత్తానికి రోజుకు 5 క్యూసెక్కుల చొప్పున 50 రోజులపాటు 5 టీఎంసీల నీటిని విడుదల చేసేందుకు కర్ణాటక ప్రభుత్వం ఒప్పుకున్నట్లు మంత్రులు ప్రకటించారు. అయితే మంత్రులు చేసిన ప్రయత్నం మూణ్నాళ్ల ముచ్చటగానే మిగిలింది. ఎగువ నుంచి వచ్చే నీరు ఈ నెల 2 నాటికే నిలిచిపోయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement