జిల్లాలో మైనింగ్ ద్వారా వస్తున్న ఆదాయం, ఇసుక రవాణాకు ఇస్తున్న అనుమతిపై ఎంపీ వివరాలు కోరారు. ఇసుక అక్రమ రవాణాపై ఫిర్యాదులు వస్తున్నాయని.. అడ్డుకట్ట వేయా లని అధికారులను ఆదేశించారు. ఇసుక రీచ్‌ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పర్యవేక్షణ పటిష్టం చేయాలని కలెక్టర్‌కు సూచించారు.
రోడ్లపై గుంతలు పూడ్చాలి..
ఊట్కూర్ మండలం వల్లంపల్లి రోడ్డు నిర్మాణ పనులు త్వరగా చేపట్టాలని పీఆర్ ఈఈని ఆదేశించారు. నారాయణపేట–మక్తల్ రహదారి పనులు ప్రారంభమయ్యే వరకు రోడ్డుపై ఏర్పడిన గుంతలను పూడ్చాలని ఆర్‌అండ్‌బీ అధికారులకు సూచించారు. ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద చేపడుతున్న, చేపట్టాల్సిన రహదారుల వివరాలను అధికారులు తెలియజేశారు.
4 వేల శస్త్రచికిత్సలు..
జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో అందుతున్న వైద్యసేవలను వైద్య కళాశాల ప్రిన్సిపాల్, సూపరింటెండెంట్ డా. సంపత్‌కుమార్ వెల్లడించారు. 6,500 ఇన్‌పేషెంట్ కేసులు నమోదయ్యాయని, అక్టోబర్ నుంచి ఇప్పటి వరకు సుమారు 4 వేల శస్త్రచికిత్సలు నిర్వహించినట్లు తెలిపారు. సాంకేతిక, సాంకేతికేతర విభాగాల్లో 34 కేటగిరీలకు సంబంధించి 154 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసి నియామక ప్రక్రియ పూర్తి చేసినట్లు వెల్లడించారు
● సమావేశంలో పంచాయతీరాజ్, వైద్య ఆరోగ్యం, వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, విద్యుత్, గృహ నిర్మాణ, విద్య, ఎస్సీ అభివృద్ధి, ఆర్‌డబ్ల్యూఎస్, పౌరసరఫరాలు, నాబార్డు, మైనింగ్, పశుసంవర్ధక, మత్స్య, అటవీ, ఉద్యాన, ఇరిగేషన్, కార్మిక, జాతీయ రహదారులు, ఆర్‌అండ్‌బీ తదితర శాఖల అధికారులు తమ శాఖల సమగ్ర నివేదికలు సమర్పించారు.


