మక్తల్: జూరాల బ్యాక్‌వాటర్‌లో ముంపునకు గురైన అంకేన్‌పల్లిలో భూ సేకరణకు ప్రభుత్వం సోమవా రం ఉత్తర్వు లు జారీ చేయడంతో స్థాని కులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గతంలోనే జూరాల బ్యాక్ వాటర్‌లో అంకేన్‌పల్లి ముంపునకు గురైంది. కానీ స్థానికులకు పరిహారం అందలేదు. ఈ క్రమంలో రాష్ట్ర ఇరిగేషన్ శాఖమంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి చొరవతో భూ సేకరణ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం 21 మే, 2026 జీఓను విడుదల చేసింది. పెండింగ్‌లో ఉన్న సమస్యను వెంటనే పరిష్కరించాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు అధికారులు అంకేన్‌పల్లిలో 67.19 ఎకరాల భూ సేకరణ చేసేందుకు జీఓను విడుదల చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ.. తమ సమస్యను పరిష్కరించాలని ఏళ్లుగా అందరికీ మొరపెట్టుకున్నా ఎవరూ స్పందించలేదని వాపోయారు. గతంలో కొందరికి పరిహారం అందలేదని, మంత్రి వాకిటి చొరువతో అందరికీ న్యాయం జరిగిందని హర్షం వ్యక్తం చేశారు.
అంకేన్‌పల్లి గ్రామం


