ఇంజనీర్ కావాలని ఉంది.
● పునరావాస కేంద్రంలో
కనీస సౌకర్యాలు కరువు
● రెండేళ్లుగా చీకట్లోనే గడుపుతున్న పలు కాలనీల ప్రజలు
● పాఠశాల నిర్మాణం సైతం
అసంపూర్తిగానే..
● సమస్యలు పట్టని పాలకులు
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: ప్రభుత్వం విడుదల చేసిన పాలిసెట్ పరీక్ష ఫలితాల్లో ఉమ్మడి జిల్లాకు చెందిన ఇద్దరికి రాష్ట్ర మొది ర్యాంక్ వచ్చింది. మహబూబ్‌నగర్‌లోని షాషాబ్‌గుట్టకు చెందిన కోట్ల మురళీధర్, శ్రీలతల కుమార్తె కోట్ల అపూర్వ ఎంపీసీ, ఎంబైపీసీ విభాగంలో 120 మార్కులకు 120 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో మొదటిర్యాంక్ సాధించింది. అలాగే నాగర్‌కర్నూల్‌కు చెందిన వాన్మయ్‌రెడ్డి సైతం రాష్ట్ర మొదటి ర్యాంక్ సాధించండం విశేషం. ‘రాష్ట్రస్థాయిలో మొదటిర్యాంక్ సాధించడం మాటల్లో చెప్పలేని సంతోషంగా ఉంది. తాను డాక్టర్ కావడమే లక్ష్యమని, అందుకోసం కష్టపడి చదువుతాను.’అని అపూర్వ పేర్కొన్నారు.
సమస్యలతో సహవాసం!
గట్టు: చిన్నోనిపల్లె నిర్వాసితులకు కనీస సౌకర్యాలు కరువయ్యాయి. రెండేళ్ల క్రితం గ్రామాన్ని ఖాళీ చేసి, పునరావాస కేంద్రంలోకి మారిన నిర్వాసితులు అనేక సమస్యలతో సతమతమవుతున్నారు. నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం 101వ ప్యాకేజీలో భాగంగా చిన్నోనిపల్లె వద్ద 2006లో రిజర్వాయర్ నిర్మా ణం చేపట్టి పూర్తిచేశారు. 2024 నుంచి నీటి నిల్వ చేస్తున్నారు. రిజర్వాయర్ బ్యాక్‌వాటర్ గ్రామంలోకి రావడంతో గ్రామస్తులు ఇళ్లను ఖాళీచేసి.. యర్రగట్టు వద్ద ఏర్పాటుచేసిన పునరావాస కేంద్రంలోకి మారారు. నాటి నుంచి రెండేళ్లుగా సమస్యలతో సహవాసం చేస్తున్నారు.
కొన్ని ఇళ్లకే తాగునీరు..
మిషన్ భగీరథ పథకంతో కొన్ని ఇళ్లకు మాత్రమే తాగునీరు అందుతోంది. చాలా కుటుంబాలు తాగునీటి సౌకర్యానికి నోచుకోవడం లేదు. బోరుమోటా ర్ల ద్వారా అక్కడక్కడ ఏర్పాటుచేసిన నీటి నిల్వ తొట్ల నుంచి నీటిని తెచ్చుకోవాల్సి వస్తుందని నిర్వా సితులు ఆవేదన చెందుతున్నారు. తామే చందాలు వేసుకొని ఆంజనేయస్వామి ఆలయాన్ని నిర్మించుకున్నామని తెలిపారు. పునరావాస కేంద్రంలో శ్మశానవాటిక కూడా సమస్యగా ఉందని.. ఇంకా 20 కుటుంబాలకు షిఫ్టింగ్ చార్జీలను చెల్లించలేదని వాపోతున్నారు.
తడికెల మధ్యే తరగతులు..
పునరావాస కేంద్రంలో పాఠశాల నిర్మాణం అసంపూర్తిగా ఉంది. ఫిల్లర్లతో రెండంతస్తుల భవనాన్ని ని ర్మించి గదులను నిర్మించకుండా వదిలేశారు. దీంతో తడికెలను అడ్డుగా పెట్టుకుని తరగతి గదులను ఏ ర్పాటుచేశారు. పునరావాస కేంద్రంలో దాదాపు 15 ఏళ్ల క్రితం ప్రారంభించిన ప్రాథమిక పాఠశాల నిర్మాణాన్ని నేటికీ పూర్తి చేయడం లేదని నిర్వాసితులు ఆవేదన చెందుతున్నారు. రెండేళ్ల కాలంలో చిన్న ఇటుకను కూడా పేర్చలేదని పేర్కొంటున్నారు.
చిన్నోనిపల్లె పునరావాస కేంద్రం
చిన్నోనిపల్లెలో జనాభా : 1096
ఓటర్లు : 760
నివాసగృహాలు : 360
(పాత ఊరిలో 257)
పాలిసెట్ ఫలితాల్లో రాష్ట్ర స్ధాయిలో మొదటి ర్యాంకు రావడం చాలా ఆనందంగా ఉంది. అమ్మనాన్నల ప్రోత్సాహం, మా పాఠశాల ఉపాధ్యాయుల సహకారంతో నేను ఈ ర్యాంకు సాధించాను.పదో తరగతి స్థాయిలో పాఠ్యపుస్తకాలు సేకరించి ఇంటి వద్దనే ప్రిపరేషన్ కొనసాగించా. భవిష్యత్తులో ఇంజనీర్ కావాలని నా కోరిక.
– వాన్మయ్‌రెడ్డి, నాగర్‌కర్నూల్
చిన్నోనిపల్లె పునరావాస కేంద్రంలో అంతర్గత రో డ్లు అధ్వానంగా తయారయ్యాయి.ప్రధాన రోడ్డు ను సీసీగా మార్చేందుకు నిధులు వచ్చినా నిర్మా ణం చేపట్టకుండా నిర్లక్ష్యం చేస్తున్నట్లు గ్రామస్తులు ఆరోపించారు. దీనికి తోడు గ్రామంలో ఎప్పుడో ఏర్పాటుచేసిన డ్రెయినేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైంది. మురుగు ముందుకు పారకుండా
నిలిచిపోతుండటంతో కిందిగేరి కాలనీ దుర్గందభరితంగా మారుతోంది. అదే విధంగా వడ్డే వీధి, కుర్వ వీధుల్లో విద్యుత్ సర ఫరా లేకపోవడంతో చీకట్లోనే కాలనీవాసులు జీవనం సాగిస్తున్నారు. ఇప్పటికై నా పాలకులు, అధికారులు స్పందించి చిన్నోనిపల్లి పునరావాస కేంద్రంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని నిర్వాసితులు కోరుతున్నారు.


