● గరిష్టంగా రూ.1,400,కనిష్టంగా రూ.800
దేవరకద్ర: పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డుకు బుధవారం ఉల్లి పోటెత్తింది. వివిధ గ్రామాల నుంచి రైతులు పెద్దఎత్తున ఉల్లిని అమ్మకానికి తెచ్చారు. దాదాపు 10 వేల బస్తాల ఉల్లి మార్కెట్‌కు రావడంతో ఎక్కడ చూసినా ఉల్లి కుప్పలే కనిపించాయి. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన వేలం మధ్యాహ్నం వరకు కొనసాగింది. అయితే వచ్చిన ఉల్లిలో అటు ఇటుగా ఉన్న ఉల్లి కుప్పలకు ధరలు నిర్ణయించి వ్యాపారులు కొనుగోలు చేశారు. ఉల్లి వేలంలో క్వింటాల్ గరిష్టంగా రూ.1,400, కనిష్టంగా రూ.8,00 వరకు ధరలు పలికాయి. మార్కెట్ నిబంధనల ప్రకారం 50 కిలోల బస్తాలుగా ఉల్లిని తూకం వేసి అమ్మకాలు సాగించారు. బస్తా ధర గరిష్టంగా రూ.700, కనిష్టంగా రూ.400 వరకు విక్రయించారు. ఇతర మార్కెట్‌ల నుంచి వచ్చిన వ్యాపారులు పెద్దమొత్తంలో ఉల్లిని కొనుగోలు చేసి తరలించారు. ఇక స్థానిక వ్యాపారులు, చిరు వ్యాపారులు, వినియోగదారులతో మార్కె ట్ అంతా సందడిగా కనిపించింది.


