నారాయణపేట: పురపాలికను అన్నిరంగాల్లో అభివృద్ధి చేసి ఆదర్శంగా తీర్చిదిద్దుతానని పుర చైర్‌పర్సన్ శ్వేత సత్యయాదవ్ అన్నారు. బుధవారం స్థానిక పుర కార్యాలయంలో పదవీ బాధ్యతలు స్వీకరించారు. కొత్తగా ఏర్పాటు చేసిన చాంబర్‌లో చైర్‌పర్సన్ దంపతులతో వేద పండితులు ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం చైర్‌పర్సన్ కుర్చీలో కూర్చున్న తర్వాత వేదపండితుల ఆశీర్వదం తీసుకున్నారు. పుర కమిషనర్ నర్సయ్య చైర్‌పర్సన్‌తో రిజిస్టర్‌లో తొలి సంతకం చేయించారు. చైర్‌పర్సన్‌తో పాటు వైస్ చైర్మన్ మంజుల రాఘవేందర్‌రెడ్డిని మున్సిపల్ అధికారులు, సిబ్బంది, పట్టణంలోని ప్రముఖులు ఆమెకు పుష్పగుచ్ఛం అందజేసి శాలువాలతో సన్మానించారు. సన్మానించిన వారిలో మార్కెట్ కమిటీ చైర్మన్ సదాశివారెడ్డి, డీసీసీ మాజీ అధ్యక్షుడు కుంభం శివకుమార్‌రెడ్డి, మాజీ పుర వైస్ చైర్మన్ హరినారాయణ భట్టడ్, బీజేపీ రాష్ట్ర నాయకుడు రతంగ్‌పాండురెడ్డితో పాటు వివిధ పార్టీల నాయకులు ఉన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు సత్యయాదవ్ తదితరులు పాల్గొన్నారు.


