మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: పీయూలో వచ్చే నెల 2న తెలంగాణ కామర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో యూనివర్సిటీ స్థాయి అంతర్ కళాశాలల కామర్స్ ఫెస్ట్ ప్రేరణ–2026 నిర్వహించనున్నారు. ఈ మేరకు బుధవారం కార్యక్రమ బ్రోచర్‌ను వీసీ శ్రీనివాస్, రిజిస్ట్రార్ రమేష్‌బాబు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వీసీ శ్రీనివాస్ మాట్లాడుతూ ఇది కేవలం ఫెస్ట్ మాత్రమే కాదని, కామర్స్ విద్యార్థుల్లో దాగి ఉన్న సృజన, ప్రతిభను వెలికి తీసేందుకు చేస్తున్న కార్యక్రమం అన్నారు. ఈ నెల 30లోగా విద్యార్థులు తమ పేరును నమోదు చేసుకోవాలని, ఇక్కడ గెలుపొందిన విద్యార్థులు సికింద్రాబాద్‌లోని అవినాష్ కళాశాలలో వచ్చేనెల 7న జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనాల్సి ఉంటుందన్నారు. కార్యక్రమంలో ఆడిట్‌సెల్ డైరెక్టర్ చంద్రకిరణ్, కంట్రోలర్ ప్రవీణ, ప్రిన్సిపాల్ మధుసూదన్‌రెడ్డి, అడిషనల్ కంట్రోలర్ అనురాధరెడ్డి, బీఓఎస్ చైర్మన్ ఆఫ్ కామర్స్ రాజ్‌కుమార్, రంగప్ప, సురేష్ తదితరులు పాల్గొన్నారు.
పుస్తకం ఆవిష్కరణ
పీయూలో అధ్యాపకులు మధు మోటమారి, భారతి సంయుక్తంగా రచించిన నానోఫ్లూయిడ్స్ రంగంలో విశేష పరిశోధన, నూతన గ్రంథం పుస్తకాన్ని వీసీ శ్రీనివాస్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిశోధన విద్యార్థులకు ఇది ఒక దిక్సూచిలా పనిచేస్తుందన్నారు.


