కోస్గి రూరల్: గ్రామీణ ప్రాంతాల్లోని పేదలకు ఆర్థిక భరోసా కల్పించి వారిని అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని కడా చైర్మన్ వెంకట్‌రెడ్డి, కాంగ్రెస్‌పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ తిరుపతిరెడ్డి అన్నారు. బుధవారం గుండుమాల్‌లోని రైతువేధికలో మండలంలోని భోగారం గ్రామానికి చెందిన 8 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు అందజేసి మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం పేదల అభ్యున్నతే ధ్యేయంగా పని చేస్తోందన్నారు. రైతులకు రైతుభరోసా అందించి పంట పెట్టుబడికి ఆసరాగా నిలుస్తుందని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్ వార్ల విజయ్‌కుమార్, బోగారం సర్పంచ్ శేఖర్‌గౌడ్, ఉప సర్పంచ్ సాయప్ప, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు జయప్రకాశ్‌రెడ్డి, మాజీ ఎంపీపీ మధుకర్‌రావు, సురేష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
రూ.85.10 లక్షలు
పలికిన సంత
కోస్గి రూరల్: పుర పరిధిలోని పశువుల సంత వేలం 2026–27 ఆర్థిక సంవత్సరానికిగాను రూ.85.10 లక్షలు పలికిందని పుర కమిషనర్ నాగరాజు, చైర్మన్ నాగులపల్లి నరేందర్ తెలిపారు. బుధవారం పుర కార్యాలయంలో నిర్వహించిన వేలంలో 9 మంది పాల్గొనగా మాటికోటి వెంకటయ్య రూ.85.10 లక్షల పాటపాడి దక్కించుకున్నారని వివరించారు. తైబజార్‌కు 13 మంది పోటీపడగా రవికుమార్ రూ.34.13 లక్షలకు చేజిక్కించుకున్నట్లు చెప్పారు. పశువుల సంత గతేడాది కంటే ఈసారి రూ.16.06 లక్షలు, తైబజార్ రూ.3,10,500 ఎక్కువ వచ్చిందని తెలిపారు. వేలంలో వైస్ చైర్‌పర్సన్ సరిత, జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్ వార్ల విజయ్‌కుమార్, కౌన్సిలర్లు మాస్టర్ శ్రీనివాస్, అంజిలయ్య, భానునాయక్, మేకల రాజేష్, కోడిగంటి హరి, ఓంప్రకాశ్, తుడుం శ్రీనివాస్, పుర మేనేజర్ అనిల్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
విశ్రాంత ఉద్యోగుల
నిరసన
నారాయణపేట: కేంద్ర ప్రభుత్వం వ్యాలిడేషన్ యాక్ట్‌ను వెంటనే రద్దు చేయాలని విశ్రాంత ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు ఎల్.మనోహర్‌ప్రసాద్‌గౌడ్, పట్టణ అధ్యక్షుడు భరత్‌కుమార్ డిమాండ్ చేశారు. బుధవారం జిల్లా విశ్రాంత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో విశ్రాంత ఉద్యోగులు పట్టణంలోని కార్యాలయం నుంచి కలెక్టరేట్‌కు ర్యాలీగా చేరుకొని ఏఓ శ్రీధర్‌కు డిమాండ్ల వినతిపత్రం సమర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో వ్యాలిడేషన్ యాక్ట్ ఆమోదించిందని, ఈ చట్టం ప్రకారం 1.1.2026న పదవీ విరమణ పొందిన వారికి భవిష్యత్‌లో పీఆర్సీలో ఫిట్‌మెంట్ బెనిఫిట్స్ లేకుండా తీవ్ర నష్టాన్ని కలగజేస్తుందన్నారు. ఈ యాక్ట్ రాజ్యాంగ సూత్రాలతో పాటు సుప్రీంకోర్టుకు వ్యతిరేకమని, పింఛన్ ఉద్యోగుల సంక్షేమానికి అన్యాయం జరుగుతుందని, వెంటనే రద్దు చేయాలని కోరారు. కార్యక్రమంలో సత్యనారాయణ, బాలరాజు, రాములు, ఎంఎస్ కుమార్, కృష్ణయ్య, గందె గంగాధర్, ధర్మరాజ్, దశరథ్, నారాయణ, సంగంనాథ్ తదితరులు పాల్గొన్నారు.


