నారాయణపేట | - | Sakshi
Sakshi News home page

నారాయణపేట

Mar 25 2026 8:06 AM | Updated on Mar 25 2026 8:06 AM

ఎట్టకేలకు బాధ్యతలు

బుధవారం శ్రీ 25 శ్రీ మార్చి శ్రీ 2026

నారాయణపేట: మున్సిపల్‌ ఎన్నికలు పూర్తయి.. చైర్‌పర్సన్‌గా కొండ శ్వేత సత్యయాదవ్‌ ఎన్నికై నా బాధ్యతలు మాత్రం స్వీకరించలేదు. ఇదిలా ఉండగా నారాయణపేటలో బీజేపీ జిల్లా కార్యాలయ నూతన భవనాన్ని, మున్సిపల్‌ ఎన్నికల విజయోత్సవ ర్యాలీతో పాటు మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ బాధ్యతల స్వీకరోత్సవాన్ని వైభవంగా నిర్వహించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు సత్యయాదవ్‌ ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. ఈ క్రమంలో బుధవారం ఉదయం 9 గంటలకు మూహుర్తం ఫిక్స్‌ చేశారు. మున్సిపల్‌ కార్యాలయంలోని నైరుతి భాగంలో మున్సిపల్‌ చాంబర్‌ ఉండాలనే వాస్తు నిపుణుల సూచనలతో గదిని సిద్ధం చేశారు.

11 స్థానాలతో..

స్థానిక మున్సిపాలిటీలో బీజేపీ 10 కౌన్సిలర్‌ స్థానాలు సాధించగా.. రెబెల్‌గా గెలిచిన మరో కౌన్సిలర్‌ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు సమక్షంలో పార్టీలో చేరడంతో బలం 11 సభ్యులకు చేరింది. ఇందుకు జిల్లా అధ్యక్షుడు సత్యయాదవ్‌ ప్రధాన పాత్ర పోషించారు. దీంతో ఎంపీ డీకే అరుణ, బీజేపీ అధిష్టానం సత్యయాదవ్‌ సతీమణి కొండ శ్వేతను చైర్‌పర్సన్‌ నియమించేందుకు మొగ్గుచూపారు. వైస్‌ చైర్మన్‌గా మంజుల రాఘవేందర్‌రెడ్డి ఎన్నికయ్యారు. చైర్‌పర్సన్‌, వైస్‌ చైర్మన్‌లతో పాటు కౌన్సిలర్లు గత నెల 16న అధికారికంగా ప్రమాణస్వీకారం చేశారు.

మున్సిపల్‌ చైర్‌పర్సన్‌గా కొండా శ్వేత

ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement