7
నారాయణపేట: పెట్రోల్ బంకులు బంద్ అవుతా యనే ప్రచారం, ఇంధన కొరత వార్తలతో ప్రజలు భయాందోళనతో బంకుల వద్ద వాహనదారులు భారీగా బారులు తీరారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని పలు బంకుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమిచ్చాయి. పెట్రోల్ ఉన్న బంకుల వద్ద వాహనాల రద్దీతో పెరగడంతో నిర్వాహకులు ఇబ్బందులు పడాల్సి వచ్చింది. కొన్ని చోట్ల ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. జిల్లా కేంద్రానికి సమీపంలోని సింగారం చౌరస్తాలోని జెడ్‌ఎంఎస్, మక్తల్ రోడ్‌లో ని మరో బంకు వద్దకు వాహనాలు భారీగా రావడంతో గంట వ్యవధిలోనే వారు సైతం నో స్టాక్ అంటూ చేతులేత్తాశారు. రాష్ట్రంలో కావాల్సినంత పెట్రోల్ నిల్వలు ఉన్నాయని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రభుత్వం స్పష్టం చేస్తున్నా.. పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో ఇంధన సరఫరాలో అంతరాయం కలగవచ్చనే ఆందోళనలు ఈ రద్దీకి కారణమవుతున్నయని అధికారులు అంటున్నారు.


