‘టీబీ రహితరాష్ట్రంగా మార్చుదాం’ | - | Sakshi
Sakshi News home page

‘టీబీ రహితరాష్ట్రంగా మార్చుదాం’

Mar 25 2026 8:06 AM | Updated on Mar 25 2026 8:06 AM

ధన్వాడ: తెలంగాణ రాష్ట్రాన్ని టీబీ రహిత రాష్ట్రంగా మార్చేందుకు ప్రజలు సహకరించాలని జిల్లా వైద్యాశాఖ అధికారి జయచంద్రమోహన్‌ పిలుపునిచ్చారు. ప్రపంచ టీబీ దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన టీబీ క్యాంపును స్థానిక సర్పంచు జ్యోతితో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌ఓ మాట్లాడుతూ.. వైద్యుల సూచన మేరకు మందులు వాడితే టీబీ వ్యాధిని నిర్మూలించవచ్చన్నారు. ఉత్తమ సేవలు అందించిన వైద్య సిబ్బందికి బహుమతులను అందజేశారు. 14 ఏళ్లు పైబడిన మహిళ లకు స్కానింగ్‌ చేశారు. 50 మంది సస్పెక్ట్‌ కేసులుగా గుర్తించినట్లు వారు తెలిపారు. అనంతరం ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ప్రోగాం అధికారి సత్యప్రకాష్‌, డాక్టర్‌ అనుషా, భీష్మఫౌండేషన్‌ అధ్యక్షుడు భీష్మరాజ్‌ తదితరులు పాల్గొన్నారు.

కారుణ్య నియామకాలు చేపట్టాలి

నారాయణపేట రూరల్‌: జిల్లాలో నాలుగేళ్లుగా నుంచి కారుణ్య నియామకాలు చేపట్టలేదని, త్వరగా నియమించి న్యాయం చేయాలని జిల్లా పరిషత్‌ సీఈఓ మొగులప్పకు తపస్‌ జిల్లా శాఖ ఆధ్వర్యంలో మంగళవారం వినతిపత్రం అందించారు. అనంతరం మాట్లాడుతూ.. జీపీఎఫ్‌ చెల్లింపులు వేగవంతం చేసి ఆన్‌లైన్‌ త్వరగా పూర్తి చేయాలని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి షేర్‌ కృష్ణారెడ్డి, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు నరసింహ, రవీందర్‌, జిల్లా కోశాధికారి కిషోర్‌కుమార్‌, నాయకులు నర్సింలు, రాజు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement