చారిత్రక వైభవం.. | - | Sakshi
Sakshi News home page

చారిత్రక వైభవం..

Nov 9 2025 9:19 AM | Updated on Nov 9 2025 9:19 AM

చారిత

చారిత్రక వైభవం..

గ్రామాల్లో పర్యటించి పరిశోధన ద్వారా తెలుసుకున్న చరిత్రకు భావితరాలకు అందించేందుకు పుస్తకాలు, రచనలు, డాక్యుమెంట్ల రూపంలో వెలుగులోకి తేవాల్సి ఉంది. అయితే రెండేళ్ల క్రితం ఈ కార్యక్రమాన్ని చేపట్టినా ప్రభుత్వం ఇందుకు అవసరమైన నిధులను కేటాయించలేదు. ఇది పూర్తిగా ప్రొఫెసర్లు, డిగ్రీ విద్యార్థులు, ఔత్సాహిక పరిశోధకులు స్వచ్ఛందంగా చేపట్టాల్సి రావడంతో చాలావరకు గ్రామాల పర్యటన, చరిత్ర పరిశోధన ఆశించినంత సాగడం లేదు. ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేసి, భావితరాలకు అందించేలా చర్యలు చేపట్టాలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

సాక్షి, నాగర్‌కర్నూల్‌: మీ గ్రామానికి ఆ పేరెలా వచ్చింది..? ఎన్ని ఏళ్ల కిందట గ్రామంగా ఏర్పడింది. అంతకు ముందు ఆ గ్రామం ఏ పేరుతో ఉండేది? ఇలాంటి విషయాలపై ఎప్పుడైనా ఆలోచించారా? పురాతన చారిత్రక ఆనవాళ్లు ఉన్న గ్రామాలు, వాటి నేపథ్యం, గ్రామాల చరిత్రలో నెలకొన్న ఆసక్తికరమైన అంశాలపై ప్రభుత్వం రెండేళ్ల కిందట ప్రయత్నాలను మొదలుపెట్టింది. తెలంగాణ సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో మన ఊరు – మన చరిత్ర కార్యక్రమాన్ని చేపట్టింది. ప్రముఖమైన, పురాతన ఆనవాళ్లు ఉన్న గ్రామాలను ఎంచుకుని ఆయా గ్రామాలకు ఉన్న పేర్లు ఎలా వచ్చాయి, గతంలో ఎలాంటి చరిత్ర ఉండేది అన్న ఆధారంగా అధ్యయనం కొనసాగింది. ఈ క్రమంలో జిల్లాలోని పలు గ్రామాల చరిత్రలో ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి.

చాలా కొత్త విషయాలు తెలిశాయి..

మన ఊరు – మన చరిత్ర కార్యక్రమంలో భాగంగా చాలా వరకు గ్రామాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి అధ్యయనం చేపట్టాం. పలుగ్రామాల చరిత్ర పరిశోధనలో ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మారుమూల గ్రామాల్లో మనకు తెలియని కొత్త చరిత్ర బహిర్గతమవుతోంది. ఆనాటి సామాజిక పరిస్థితులు, వివక్ష తదితర అంశాలు తెలుస్తున్నాయి.

– పెబ్బేటి మల్లికార్జున్‌, ప్రాజెక్ట్‌ జిల్లా కోఆర్డినేటర్‌)

నాటి చరిత్రకు సాక్ష్యంగా

నేటికీ నిలిచిన కట్టడాలు

మన ఊరు మన చరిత్ర కార్యక్రమంలో భాగంగా వెలుగులోకి కొత్త చరిత్ర

స్థానికంగా ఉన్న చరిత్ర బాహ్య ప్రపంచంలోకి..

గ్రామాల పేర్లు, కట్టడాలు, శాసనాల ఆధారంగా పరిశోధన

అందరికీఅందుబాటులోకి తెస్తేనే..

చారిత్రక వైభవం.. 1
1/2

చారిత్రక వైభవం..

చారిత్రక వైభవం.. 2
2/2

చారిత్రక వైభవం..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement