జిల్లా వ్యాప్తంగా అవగాహన సదస్సులు
జిల్లాలోని ఆరోగ్య ఉప కేంద్రాలు, పీహెచ్‌సీలు, జిల్లా ఆస్పత్రులు, విద్యాసంస్థలు, అంగన్‌వాడీ కేంద్రాలు, పోలీసులు, మహిళా సంఘాలు, కార్మికులు ఉండే ప్రదేశాలు, బస్టాండ్, ప్రధాన కూడలిలలో జిల్లా వైద్య శాఖ తరపున ఆరోగ్య కార్యకర్తలు, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సంయుక్తంగా కృత్రిమ మానవ దేహంతో సీపీఆర్‌పై అవగాహన కల్పించారు. గుండెపోటు రాకుండా చేపట్టాల్సిన చర్యలతో పాటు గురైనప్పుడు తక్షణమే సీపీఆర్ ఎలా చేయాలనే అంశంపై వివరించారు. అదేవిధంగా నైపుణ్యం కలిగిన వైద్య బృందం మాన్ క్వీన్స్, వీడియో ప్రదర్శన ద్వారా అవగాహన కల్పించారు.


