నేడు మాణికేశ్వరి మాత ఆశ్రమంలో వేడుకలు
నారాయణపేట రూరల్: జిల్లా కేంద్ర సమీపంలోని పగిడిమర్రి రోడ్డులో వీరధర్మజ మాణికేశ్వరి మాత ఆశ్రమం సప్తమ వార్షికోత్సవ వేడుకలను ఆశ్రమంలో ఆదివారం నిర్వహిస్తున్నట్లు ఆశ్రమ కమిటీ సభ్యులు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా సప్తమ వార్షికోత్సవ పూజా కార్యక్రమం, ధ్వజారోహణం, గోమాత పూజ, నాగ సింహాసన అభిషేకం, అమ్మవారి పాదుకల అభిషేకం, మహా గాయత్రి యజ్ఞం, మహా మంగళ హారతి, కార్తీక దీపోత్సవం, తీర్థ ప్రసాద, అన్నదానం తదితర కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ వేడుకల్లో భక్తులు పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరారు.
మహిళా చైతన్యంతోనే సమాజాభివృద్ధి
నారాయణపేట రూరల్: మహిళలు చైతన్యవంతం కావడం వల్లనే సమాజం పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందుతుందని గుడిపల్లి మంజుల అన్నారు. సరస్వతి విద్యాపీఠం ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన సప్తశక్తి సంఘం కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. మహిళ శక్తి రూపమని, ఏ పనిలోనైనా విజయం సాధించాలంటే మహిళల భాగస్వామ్యం అవసరమన్నారు. స్వాతంత్ర సంగ్రామంలో సైతం వీరనారుల పోరాటం వెలకట్టలేనిది అన్నారు. కుటుంబంలో మహిళ పాత్ర ఎంతో విలువైనదని, సమాజ అభివృద్ధికి వారి ప్రోత్సాహం ఎంతో అవసరమని సూచించారు. అన్ని రంగాల్లోనూ మహిళలు రాణించాలని, అందుకు ఒకరినొకరు సహకరించుకోవాలన్నారు. అదేవిధంగా విదేశీ వస్తువులను విడనాడి స్వదేశీ వస్తువులను ప్రోత్సహించాలన్నారు. అనంతరం ప్రతిభా మూర్తులైన మహిళలు భారతమ్మ, డాక్టర్ దీపికా శెట్టి, దండు రాములమ్మను సన్మానించారు. అంతకుముందు చిన్నారులతో వివిధ రంగాల్లోని మహిళా ప్రముఖుల వేషధారణలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో బాలరాజు, శ్రీనివాస్ రెడ్డి, లక్ష్మయ్య గౌడ్, సీతారాములు, ఎల్లప్ప, సంగీత, శిరీష, ఉమా, పద్మజా పాల్గొన్నారు.
రాష్ట్రస్థాయి యోగాసన పోటీల్లో ప్రతిభ చాటాలి
మహబూబ్‌నగర్ క్రీడలు: రాష్ట్రస్థాయి యోగాసన పోటీల్లో క్రీడాకారులు ప్రతిభచాటాలని ఉమ్మడి జిల్లా ఒలింపిక్ సంఘం కార్యదర్శి కురుమూర్తిగౌడ్ అన్నారు. రంగారెడ్డి జిల్లా నార్సింగ్‌లోని ఎస్‌ఎంపీ స్కూల్‌లో శనివారం నుంచి ప్రారంభమైన రాష్ట్రస్థాయి సబ్ జూని యర్, జూనియర్ యోగాసన పోటీలకు ఉమ్మ డి జిల్లా క్రీడాకారులు తరలివెళ్లారు. ఈ సందర్భంగా స్థానిక మెయిన్ స్టేడియంలో క్రీడాకారులను కురుమూర్తిగౌడ్ అభినందించారు. రాష్ట్రస్థాయి పోటీల్లో పతకాలు సాధించి జిల్లాకు పేరు ప్రతిష్టలు తీసుకురావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా యోగాసన క్రీడా సంఘం కార్యదర్శి ఆర్.బాల్‌రాజు, భారత్ వికాస్ పరిషత్ ప్రతినిధి జి.పాండురంగం, యోగ సంఘం సభ్యులు సూర్యప్రకాశ్, కిషన్‌దాస్, వెంకటేశ్, బాలమణి పాల్గొన్నారు.
● 8–10 ఏళ్ల విభాగంలో అరుణ్, అరవింద్‌సాయి, యుగంధర్, సంజయ్, ప్రశాంత్ ఆర్య, వైష్ణవి, శ్రీరాఘవి, అర్చన, ప్రియ, అద్వేత, 10–12 విభాగంలో సంపత్‌కుమార్, శ్రీప్రసాద్, గౌతమ్, హరికృష్ణ, ఉదయ్‌కుమార్, దీపిక, క్రిష్ణవేణి, మనస్విని, మోక్షిత, రూప, 12–14 విభాగంలో చరణ్, రంజిత్‌కుమార్, విఘ్నేష్, సృజన్ కుమార్, జయచంద్ర, ధనలక్ష్మి, స్వప్న, నవిత, నయనశ్రీ, వైష్ణవి, 14–16 విభాగంలో శివతేజ, బాలు, సుశీల్‌కుమార్, సాగర్, కార్తీక్, జె.వైష్ణవి, నందిని, ప్రవళిక, రూపలత, దీపిక, 16–18 విభాగంలో తిరుపతి, చైతన్య, వంశీ ఎంపికయ్యారు.
ఆర్‌ఎన్‌ఆర్ ధర రూ.2,156
దేవరకద్ర: స్థానిక మార్కెట్ యార్డులో శనివారం జరిగిన టెండర్లలో ఆర్‌ఎన్‌ఆర్ ధాన్యం ధర క్వింటాల్‌కు గరిష్టంగా రూ.2,156, కనిష్టంగా రూ.1,936గా ధరలు లభించాయి. హంస ధాన్యం ధర గరిష్టంగా రూ.1,769, కనిష్టంగా రూ.1,739గా ధరలు నమోదయ్యాయి. సీజన్ కావడంతో మార్కెట్‌కు దాదాపు నాలుగు వేల బస్తాల ధాన్యం అమ్మకానికి వచ్చింది.
నేడు మాణికేశ్వరి మాత ఆశ్రమంలో వేడుకలు


