రహదారులపై దృష్టి.. | - | Sakshi
Sakshi News home page

రహదారులపై దృష్టి..

Nov 3 2025 7:22 AM | Updated on Nov 3 2025 7:22 AM

రహదారులపై దృష్టి..

రహదారులపై దృష్టి..

రెండు నుంచి

నాలుగు వరుసలుగా..

టెండర్ల దశలో బ్రిడ్జి నిర్మాణం..

మహబూబ్‌నగర్‌– గుడేబల్లూరు..

ఉమ్మడి జిల్లాలో జాతీయ రహదారుల విస్తరణకు ఆటంకం

ప్రధాన అడ్డంకిగా మారిన

భూ సేకరణ ప్రక్రియ

వేగవంతం చేయాలని

కలెక్టర్లకు ప్రభుత్వ ఆదేశం

హైదరాబాద్‌– శ్రీశైలం రహదారిలో

ఎలివేటెడ్‌ కారిడార్‌కు ప్రతిపాదనలు

మహబూబ్‌నగర్‌– మరికల్‌ ఎన్‌హెచ్‌–167 పనులకు నిధులు మంజూరు

సాక్షి, నాగర్‌కర్నూల్‌: ఉమ్మడి జిల్లాలోని జాతీయ రహదారుల విస్తరణ పనుల్లో వేగం పెరిగింది. ఇప్పటి వరకు జాతీయ రహదారుల విస్తరణ, నిర్మాణ పనులకు ప్రధానంగా భూ సేకరణే అడ్డంకిగా మారడంతో.. ఈ ప్రక్రియపై ప్రభుత్వం దృష్టిపెట్టింది. పెండింగ్‌లో ఉన్న భూ సేకరణను వేగవంతం చేయడం, నిర్వాసితులకు చట్టపరంగా పరిహారం చెల్లింపు పూర్తి చేయడంపై ఆయా జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు. జాతీయ రహదారుల విస్తరణకు కేంద్రం నుంచి ఎప్పటికప్పుడు నిధులు మంజూరు అవుతుండటంతో భూ సేకరణ ప్రక్రియ కొలిక్కి రాగానే విస్తరణ పనుల్లో వేగం పెరగనుంది.

శ్రీశైలం దారిలో..

హైదరాబాద్‌ నుంచి కల్వకుర్తి మండలం కొట్ర మీదుగా శ్రీశైలం వెళ్లే జాతీయ రహదారి విస్తరణకు ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. రెండు వరుసలుగా ఉన్న ఈ దారిని ప్రయాణానికి సౌలభ్యంగా విస్తరించేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. ఈ దారిలో అచ్చంపేట మండలం బ్రాహ్మణపల్లి నుంచి ఈగలపెంట వరకు ఎలివేటెడ్‌ కారిడార్‌ నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం సుమారు రూ.7,700 కోట్ల అంచనాతో ఎలివేటెడ్‌ కారిడార్‌ నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది.

పూర్తికావొచ్చిన కల్వకుర్తి– నంద్యాల

కల్వకుర్తి నుంచి నాగర్‌కర్నూల్‌, కొల్లాపూర్‌ మీదుగా ఏపీలోని నంద్యాల వరకు చేపట్టిన జాతీయ రహదారి–167కే పనులు చివరి దశకు చేరుకున్నాయి. రెండేళ్ల క్రితం ప్రారంభమైన ఈ రహదారి పనులు చాలా వరకు పూర్తి కాగా.. బైపాస్‌, సర్కిళ్లు, బ్రిడ్జిల నిర్మాణాలు పెండింగ్‌లో ఉన్నాయి. కల్వకుర్తి నుంచి తాడూరు మండల కేంద్రం వరకు నాలుగు వరుసల రహదారి విస్తరణ పనులు పూర్తవగా.. తాడూరు నుంచి నాగర్‌కర్నూల్‌ జిల్లాకేంద్రం వరకు పనులు పెండింగ్‌లో ఉన్నాయి. నాగర్‌కర్నూల్‌లోని కొల్లాపూర్‌ చౌరస్తా నుంచి పెద్దకొత్తపల్లి మీదుగా కొల్లాపూర్‌ వరకు విస్తరణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. గ్రామాల వద్ద పేవ్‌మెంట్‌, సైడ్‌వేల నిర్మాణాలు చేపట్టాల్సి ఉంది. కొల్లాపూర్‌ సమీపంలోని సింగోటం చౌరస్తా నుంచి కృష్ణా తీరంలోని సోమశిల వరకు కొనసాగుతున్న పనుల్లో వేగం పెరిగింది. సోమశిల వద్ద కృష్ణానదిపై చేపట్టనున్న బ్రిడ్జి నిర్మాణం పూర్తయితే ఈ మార్గంలో రాకపోకలకు ప్రారంభం కానున్నాయి.

ఉమ్మడి జిల్లాలో రెండు వరుసలుగా ఉన్న జాతీయ రహదారులను నాలుగు వరుసలుగా విస్తరించనున్నారు. జడ్చర్ల నుంచి కల్వకుర్తి– మల్లేపల్లి– హాలియా– అలీనగర్‌– మిర్యాలగూడ మీదుగా వెళ్లే ఎన్‌హెచ్‌–167 జాతీయ రహదారిని నాలుగు వరుసలుగా అభివృద్ధి చేయనున్నారు. ప్రస్తుతం రెండు వరుసలుగా ఉన్న ఈ రహదారిలో ట్రాఫిక్‌ పెరిగి వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ రోడ్డును 219 కి.మీ., మేర నాలుగు వరుసలుగా విస్తరించనున్నారు. అలాగే జాతీయ రహదారి–167ఎన్‌ పరిధిలో మహబూబ్‌నగర్‌ బైపాస్‌ నిర్మాణానికి సైతం కేంద్రం ఆమోదం తెలిపింది. మహబూబ్‌నగర్‌ శివారులోని అప్పన్నపల్లి గ్రామం వద్దనున్న రైల్వే ఓవర్‌బ్రిడ్జి(ఆర్వోబీ) నుంచి హన్వాడ మండలం చిన్నదర్పల్లి మీదుగా చించోలి రహదారి వరకు అనుసంధానం చేసేలా బైపాస్‌ నిర్మించనున్నారు. సుమారు 11 కి.మీ., మేర ఈ బైపాస్‌ రోడ్డు నిర్మాణం చేపట్టనున్నారు.

కల్వకుర్తి– నంద్యాల జాతీయ రహదారి పనులు పూర్తికావొస్తున్నా.. కీలకమైన సోమశిల బ్రిడ్జి నిర్మాణం మాత్రం టెండర్ల దశలోనే ఉంది. కృష్ణానదిపై సోమశిల వద్ద ఐకానిక్‌ బ్రిడ్జి నిర్మాణానికి ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసింది. ఈ బ్రిడ్జి నిర్మాణం చేపడితేనే ఈ రహదారి ఏపీలోని నంద్యాల వరకు అనుసంధానం కానుంది. మరో రెండేళ్లలోపు ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తిచేయాల్సి ఉండగా.. టెండర్ల ప్రక్రియలోనే జాప్యం కొనసాగుతోంది. కాగా.. ఈ నెల 5న బ్రిడ్జి నిర్మాణానికి టెండర్ల ప్రక్రియను చేపట్టనున్నారు.

ఉమ్మడి పాలమూరులోని మహబూబ్‌నగర్‌ జిల్లాకేంద్రం మీదుగా వెళ్లే జాతీయ రహదారి–167కే విస్తరణకు కేంద్రం ఇటీవల నిధులు మంజూరుచేసింది. మహబూబ్‌నగర్‌ నుంచి కర్ణాటక రాష్ట్రంలోని గుడేబల్లూరు వరకు రెండు వరుసలుగా ఉన్న ఈ రహదారిని నాలుగు వరుసలుగా విస్తరించనున్నారు. ఇందుకోసం రూ.2,278.38 కోట్లను వెచ్చించి 80.01 కి.మీ., మేర రహదారిని నాలుగు వరుసలుగా అభివృద్ధి చేయనున్నారు. హైదరాబాద్‌ నుంచి జడ్చర్ల, మహబూబ్‌నగర్‌ మీదుగా ఏపీలోని మంత్రాలయం, రాయచూరు, గోవా తదితర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు ఈ మార్గం మరింత సౌలభ్యంగా మారనుంది. ఉమ్మడి జిల్లాలోని మహబూబ్‌నగర్‌– దేవరకద్ర– మరికల్‌– జక్లేర్‌– మక్తల్‌ మీదుగా ప్రయాణించే వారికి, మహబూబ్‌నగర్‌, నారాయణపేట జిల్లావాసులకు ప్రయోజనం కలగనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement