రైల్వే స్టేషన్ ఏర్పాటుకు కృషిచేద్దాం
ఊట్కూరు: ఊట్కూరులో రైల్వే స్టేషన్ ఏర్పాటుకు కలిసికట్టుగా కృషిచేద్దామని రైల్వే స్టేషన్ సాధన సమితి అధ్యక్షుడు భాస్కర్ అన్నారు. ఆదివారం ఊట్కూరులో రైల్వే స్టేషన్ ఏర్పాటుకు అఖిలపక్ష నాయకులు, స్వచ్ఛద సంస్థ సభ్యులచే సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నూతనంగా దక్షిణ మధ్య రైల్వే చేపట్టిన వికరాబాద్ నుంచి కృష్ణా రైల్వే లైన్ ఊట్కూరు మీదుగా వెళ్తుందన్నారు. ఇక్కడ రైల్వే స్టేషన్ ఏర్పాటు చెయ్యకుండా ప్రతిపాదనలు పంపారని తెలిపారు. ఊట్కూరులో రైల్వే స్టేషన్ ఏర్పాటైతే మండలంలో 20 గ్రామాలు, కర్ణాటక ప్రాంతంలో 10 గ్రామాలకు రవాణా సౌకర్యం కలుగుతుందని తెలిపారు. రైల్వే శాఖ గతంలో విడుదల చేసిన డీపీఆర్‌లో ఊట్కూరు స్టేషన్ ఉందని, కొత్తగా చేసిన డీపీఆర్‌లో రైల్వే స్టేషన్‌కు హార్డ్ అని ఉందని ఆయన అన్నారు. రైల్వే స్టేషన్ ఏర్పాటైతే మండలం అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఇప్పటికై న రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి, ఎంపీ డికే అరుణమ్మ చొరవ తీసుకొని రైల్వే స్టేషన్ ఏర్పాటుకు కృషి చెయ్యాలని కోరారు. అనంతరం రైల్వే స్టేషన్ సాధన సమితిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ప్రధాన కార్యదర్శిగా మాజీ జెడ్పీటీసీ అరవింద్‌కుమార్, యజ్ఞేశ్వర్‌రెడ్డి, కోశాధికారిగా లక్ష్మారెడ్డి తదితరులను ఎన్నుకున్నారు. కార్యక్రమంలో వెంకటరామారెడ్డి, ఇబాదూర్ రహమాన్, కాలిక్, కృష్ణయ్యగౌడ్, పాషా, ఆనంద్, దత్తు, వడ్ల మోనప్ప, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
