ఊట్కూర్‌లో రైల్వేస్టేషన్‌ ఏర్పాటుకు కృషి | - | Sakshi
Sakshi News home page

ఊట్కూర్‌లో రైల్వేస్టేషన్‌ ఏర్పాటుకు కృషి

Nov 4 2025 8:39 AM | Updated on Nov 4 2025 8:39 AM

ఊట్కూర్‌లో రైల్వేస్టేషన్‌ ఏర్పాటుకు కృషి

ఊట్కూర్‌లో రైల్వేస్టేషన్‌ ఏర్పాటుకు కృషి

ఊట్కూర్‌: వికారాబాద్‌–కృష్ణా రైల్వే లైన్‌లో భాగంగా ఊట్కూర్‌లో రైల్వేస్టేషన్‌ ఏర్పాటుకు తనవంతు కృషిచేస్తానని రాష్ట్ర మత్స్య, క్రీడల, యువజన శాఖ మంత్రి వాకిటి శ్రీహరి హామీ ఇచ్చారు. సోమవారం ఊట్కూర్‌ రైల్వే సాధన సమితి సభ్యులు హైదరాబాద్‌లో మంత్రిని కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జిల్లాలోనే ఊట్కూర్‌ మండలం పెద్దదని, గ్రామ శివారులోనే రైల్వే లైన్‌ వెళ్తుందన్నారు. మండలవాసులు మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్‌ తదితర ప్రాంతాలకు వలస వెళ్లి స్థిరపడ్డారని వివరించారు. రైల్వేస్టేషన్‌ ఏర్పాటుతో మండలంతో పాటు కర్ణాటకలోని 10 గ్రామాలకు రవాణా సౌకర్యం మెరుగవుతుందన్నారు. దీనిపై మంత్రి స్పందిస్తూ.. త్వరలోనే రైల్వే అఽధికారులను కలిసి డీపీఆర్‌ పరిశీలిస్తానని, ఊ ట్కూర్‌లో రైల్వే స్టేషన్‌ ఏర్పాటుకు కృషిచేస్తానని చెప్పారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీలు అరవింద్‌ కుమార్‌, సూర్యప్రకాశ్‌రెడ్డి, మాజీ సర్పంచ్‌ భాస్కర్‌, లక్ష్మారెడ్డి, యఘ్నేశ్వర్‌రెడ్డి, లింగం, టప్ప దత్తు, రవికుమార్‌, హన్మంతు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement