కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాం
పీఎం కిసాన్ డబ్బుల కోసం ఆరేళ్ల నుంచి ఎదురుచూస్తున్నాం. అన్నదమ్ముల భాగ పరిష్కారమైన తర్వాత భూ పట్టాదారు పాస్‌పుస్తకాలతో వ్యవసాయ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాం. కానీ కొత్తగా భూ పట్టా చేసుకున్న వారి పేర్ల నమోదుకు కేంద్రం నుంచి ఆదేశాలు రావాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. కొత్త వారికి కూడా పీఎం కిసాన్ డబ్బులు వచ్చేలా చర్యలు తీసుకోవాలి.
– సంజీవరెడ్డి, రైతు, మరికల్
దరఖాస్తులు తీసుకోవాలి..
కొత్తగా వ్యవసాయ భూములు కొనుగోలు చేసిన వారికి కూడా పీఎం కిసాన్ డబ్బులు రైతుల ఖాతాలో జమ అయ్యేలా కేంద్ర ప్రభ్తుత్వం అనుమతులు ఇవ్వాలి. ఆరేళ్ల నుంచి పీఎం కిసాన్ దరఖాస్తును చేతిలో పట్టుకొని అధికారుల చుట్టూ తిరుగుతున్నా. కానీ ఫలితం లేకపోవడంతో వదిలేసుకున్నా.
– యాదయ్య, రైతు, తీలేర్
అనుమతులు రావాల్సి ఉంది..
కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద అర్హులైన రైతుల ఎంపికకు 2019 ఫిబ్రవరి 1వ తేదీని కటాఫ్‌గా నిర్ణయించింది. ఆ తేదీలోపు భూములు ఉన్న అర్హులైన రైతుల ఖాతాల్లోనే సమ్మాన్ నిధి జమ అవుతోంది.ఆ తర్వాత భూములు పొందిన వారికి అందడం లేదు. కటాఫ్ తేదీ పొడిగింపునకు సంబంధించి ప్రభుత్వ అనుమతుల కోసం ఎదురుచూస్తున్నాం.
– జాన్ సుధాకార్, జిల్లా వ్యవసాయశాఖ అధికారి
కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాం


