పరిశోధనలకు పునాది | - | Sakshi
Sakshi News home page

పరిశోధనలకు పునాది

Oct 10 2025 7:33 PM | Updated on Oct 10 2025 7:33 PM

పరిశో

పరిశోధనలకు పునాది

బీసీలకు తీరని అన్యాయం

నారాయణపేట: రాష్ట్ర ప్రభుత్వం చట్టబద్ధతతో కూడిన రిజర్వేషన్ల అమలుకు కృషి చేయకుండా, కోర్టు స్టే ఇవ్వడానికి పరోక్షంగా కారణమైందని బీసీ జాగృతిసేన రాష్ట్ర అధ్యక్షుడు బూర్గుపల్లి కృష్ణ యాదవ్‌ మండిపడ్డారు. జిల్లాకేంద్రంలో గురువారం బీసీ జాగృతిసేన జిల్లా అధ్యక్షుడు ఎడ్ల కుర్మయ్య ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. 75 ఏళ్లుగా బీీసీలకు రిజర్వేషన్లు అమలు కాకుండా కేవలం ఓటుబ్యాంకుగానే చూశారన్నారు. కనీసం స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు అమలైతే కిందిస్థాయి పాలనలో భాగస్వామ్యం దక్కుతుందని ఆశించామని అన్నారు. బీసీ రిజర్వేషన్లు అడ్డుకోవడం వెనుక బీసీ వ్యతిరేక శక్తులు పనిచేశాయన్నారు. బీసీలకు రాజకీయంగా తీరని అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తంచేశారు. అధికార పార్టీలోని బీసీ సామాజిక వర్గ నాయకులు, ప్రజాప్రతినిధులు ఆ పార్టీకి రాజీనామా చేసి బీసీ రిజర్వేషన్ల ఉద్యమానికి కదలిరావాలని కోరారు. సమావేశంలో బీసీ జాగృతిసేన రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకటేశ్‌ యాదవ్‌, రాజు, సతీశ్‌, గోవింద్‌, జనార్దన్‌, రాములు, ఎల్లప్ప, మల్లేశ్‌ ఉన్నారు.

మహబూబ్‌నగర్‌ ఎడ్యుకేషన్‌: పాలమూరు యూనివర్సిటీ త్వరలో పరిశోధనలకు అడ్డాగా నిలవనుంది. విద్యార్థులు, రీసెర్చి స్కాలర్స్‌, అధ్యాపకులను పరిశోధనల పరంగా ప్రోత్సహించేందుకు పీయూలో రీసెర్చ్‌ ఫెసిలిటీ భవనాన్ని నిర్మిస్తున్నారు. 2008లో ప్రారంభం అయినప్పుడు కేవలం సంప్రదాయ కోర్సులకే పరిమితమైన పీయూ.. ప్రస్తుతం రీసెర్చ్‌ ఫెసిలిటీ సెంటర్‌ నిర్మాణంతో ప్రయోగాలకు నిలయంగా మారనుంది. తెలంగాణలో రీసెర్చ్‌ ఫెసిలిటీ భవనం ఒక్క ఉస్మానియా యూనివర్సిటీలో మాత్రమే ఉండటం గమనార్హం. రెండేళ్ల క్రితం భవనం పనులు ప్రారంభమవగా.. దాదాపుగా చివరి దశలో ఉన్నాయి. త్వరలోనే అందుబాటులోకి రానున్న ఈ భవన నిర్మాణం, వసతుల కల్పన కోసం ప్రభుత్వం పూర్తిస్థాయిలో నిధులు సైతం విడుదల చేయడంతో దీని నిర్మాణంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

రూ. 25 కోట్ల వ్యయం..

రీసెర్చి ఫెసిలిటీ భవనాన్ని నిర్మించేందుకు రూ.11 కోట్లను గతంలో కేటాయించి నిర్మాణం ప్రారంభించారు. ఇందులో 5 ల్యాబ్‌లు, రెండు సెమినార్‌ హాళ్లు, కంప్యూటర్‌ ల్యాబ్‌, ఇంక్యూబేషన్‌ సెంటర్‌ వంటివి నిర్మించనున్నారు. ఈ భవనం మరో రెండు మూడు నెలల్లో అందుబాటులోకి రానుంది. ఈ క్రమంలో ఇందులో ఏర్పాటు చేసే వసతుల కోసం నిధులను సైతం ప్రభుత్వం సమకూర్చడం గమనార్హం. ఇందులో పీఎం ఉషా స్కీం ద్వారా గత విద్యా సంవత్సరం రూ.100 కోట్లను కేటాయించగా.. ఈ నిధుల్లోంచి రూ.14 కోట్లు కేవలం రీసెర్చి ఫెసిలిటీ సెంటర్‌ కోసం మాత్రమే కేటాయించింది. ప్రభుత్వం ఒక్కో మైక్రోస్కోప్‌, ఇతర ఎక్విప్‌మెంట్‌ రూ.50 లక్షల నుంచి రూ.1.20 కోట్ల వరకు వెచ్చించనుంది. ఫిజిక్స్‌, మైక్రోబయోలజీ, బాటనీ, జువాలజీ, మ్యాథ్స్‌, ఇంజినీరింగ్‌, ఫార్మసీ వంటి వారికి ఈ ల్యాబ్‌ ఎంతో ఉపయోగపడనుంది.

ఇంక్యూబేషన్‌ సెంటర్‌..

ల్యాబ్‌తోపాటు ఇంక్యూబేషన్‌ సెంటర్‌ను కూడా అధికారులు ఏర్పాటు చేయనున్నారు. ఇందులో నూతనంగా ఆవిష్కరణలు చేసే స్టార్టప్‌లు ప్రారంభించే వారు ఇక్కడ ప్రయోగాలు చేసుకునేందుకు ఆస్కారం ఉంది. ప్రయోగాల్లో ప్రొటోటైప్‌ ఆవిష్కరణలు చేసేందుకు, చేర్పులు, మార్పులు చేసేందుకు ఇవి ఎంతగానో ఉపయోగపడనున్నాయి. వీటితోపాటు ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలోని వివిధ ప్రైవేటు కంపెనీలు, ఫార్మాలు సైతం అత్యంత ఖరీదైన ప్రయోగాలను ఇక్కడ కొద్దిపాటి ఫీజులు చెల్లించి చేసుకునేందుకు ఆస్కారం ఉంటుంది. ఇక్కడ అత్యంత ఖరీదైన ల్యాబ్‌ ఎక్విప్‌మెంట్‌ ఉండటంతో ఎలాంటి ప్రయోగాలనైనా తక్కువ ఖర్చుతో చేసుకునేందుకు అవకాశం లభిస్తుంది. దీనివల్ల యూనివర్సిటీకి సైతం ఆదాయం సమకూరనుంది. కొత్తగా ఉద్యోగాల్లో చేరే వారికి స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కోసం శిక్షణ సైతం ఇందులో ఇచ్చే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు.

కీలక మైలురాయి..

పీయూలో రూ.11 కోట్లతో రీసెర్చ్‌ ఫెసిలి టీ భవనం నిర్మిస్తున్నాం. దీనిలో ఎక్విప్‌మెంట్‌ కోసం రూ.13 కోట్లు పీఎం ఉషా స్కీం ద్వారా కేటాయించాం. ఈ భవన నిర్మాణం చివరిదశలో ఉంది. ఇది అందుబాటులోకి వస్తే రీసెర్చి స్కాలర్స్‌, విద్యార్థులు, అధ్యాపకులు, ప్రైవేటు ఫార్మ కంపెనీలు ఇక్కడ ప్రయోగాలు చేసుకునేందుకు అవకాశం ఉంది. ఇంక్యూబేషన్‌ సెంటర్‌లో స్టార్టప్‌ల ఎంటర్‌ ప్రెన్యూరర్స్‌ ప్రొటోటైప్‌ ప్రయోగాల ద్వారా కొత్త అంశాలపై దృష్టి సారించవచ్చు.

– జీఎన్‌ శ్రీనివాస్‌, పీయూ వైస్‌ చాన్స్‌లర్‌

ఎంతో ఉపయోగం..

రీసెర్చి ఫెసిలిటీ భవనం త్వరలో అందుబాటులోకి రానుంది. అందులో రీసెర్చి చేసే వారికి అన్ని రకాల వసతులు కల్పించనున్నాం. దీంతో ఇక్కడ ప్రయోగాలు చేసుకునే ప్రైవేటు వారు కొద్ది మొత్తంలో ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది. ఇంక్యూబేషన్‌ సెంటర్‌ ద్వారా కొత్త ఆవిష్కరణలు జరిగే అవకాశం లభిస్తుంది. ఉమ్మడి పాలమూరుతోపాటు చుట్టు పక్కల జిల్లాల వారికి ఇది ఎంతో ఉపకరించనుంది.

– రమేష్‌బాబు, రిజిస్ట్రార్‌, పీయూ

పీయూలో నిర్మితమవుతున్న రీసెర్చ్‌ ఫెసిలిటీ భవనం

రూ.11 కోట్లతో భవనం, ఉమ్మడి జిల్లాలో రీసెర్చి ఊతం

రూ.14 కోట్లతో పరికరాల

కొనుగోలుకు అనుమతి

ఇతరత్రా వసతుల కల్పనకు సైతం నిధులు విడుదల

ఇంక్యూబేషన్‌ సెంటర్‌తో కొత్త ఆవిష్కరణలకు ఆస్కారం

పరిశోధనలకు పునాది1
1/1

పరిశోధనలకు పునాది

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement