
రాజ్యాధికారంతోనే అణగారిన వర్గాలకు న్యాయం
నారాయణపేట టౌన్: రాజ్యాధికారంతోనే అణగారిన వర్గాలకు న్యాయం చేకూరుతుందని బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు బి.శ్రీనివాస్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు నరేందర్ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో బహుజన సమాజ్ పార్టీ వ్యవస్థాపకుడు కాన్షీరాం వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. దేశంలో బహుజనులకు రాజ్యాధికార స్ఫూర్తి నింపిన మహనీయుడు కాన్షీరాం అని కొనియాడారు. జనాభా ప్రాతిపదికన దేశ సంపదను అందరికీ సమానంగా పంచడమే బీఎస్పీ లక్ష్యమన్నారు. రాష్ట్రంలో బహుజన రాజ్యం స్థాపించి తీరుతామని అన్నారు. కార్యక్రమంలో బీఎస్పీ జిల్లా కార్యదర్శి బండారి చంద్రశేఖర్, జిల్లా ఇన్‌చార్జి గువ్వల తిరుపతి, అశోక్, నర్సింహ, వెంకటయ్య, హన్మంతు పాల్గొన్నారు.