
అధికారులు బాధ్యతగా పనిచేయాలి
నారాయణపేట: అధికారులకు అప్పగించిన బాధ్య తలను సమర్థవంతంగా నిర్వర్తించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. నారాయణపేట ఎంపీడీఓ కార్యాలయం, జాజాపూర్ గ్రామపంచాయతీ, దామరగిద్దలో ఏర్పాటుచేసిన నామినేషన్ కేంద్రాలను గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా నామినేషన్ కేంద్రాల్లో హెల్ప్ డెస్క్, వీడియోగ్రఫీ, పోలీస్ బందోబస్తు తదితర అంశాలపై కలెక్టర్ ఆరా తీశారు. నోటీసు బోర్డులపై నోటిఫికేషన్ పత్రాలను ప్రదర్శించారా? లేదా అని తనిఖీ చేశా రు. ఎలాంటి పొరపాట్లు జరగకుండా ఎన్నికల ప్రక్రియ నిర్వహించాలని.. నామినేషన్ ఫారాలు తీసుకున్న వారి వివరాలను రిజిస్టర్‌లో నమోదు చేయాలని కలెక్టర్ సూచించారు. ఎస్‌ఈసీ మార్గదర్శకాలను విధిగా పాటించాలన్నారు. జిల్లాలో మొదటి విడతగా 8 జెడ్పీటీసీ, 82 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
● జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై సాధారణ పరిశీలకురాలు పి.కాత్యాయనిదేవి ఆరా తీశారు. ఈ మేరకు కలెక్టర్ సిక్తా పట్నాయక్‌తో స మావేశమై పలు అంశాలపై చర్చించారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వ హించేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్ ఉన్నారు.