
యాంటీ డ్రగ్ సోల్జర్స్‌గా మారాలి
నారాయణపేట: నేటి యువత గంజాయి, డ్రగ్స్ వంటి మత్తుపదార్థాల వాడకాన్ని పూర్తిగా నిర్మూలించి భావితరాలకు బంగారు బాటలు వేసేందుకు యాంటీ డ్రగ్స్ సోల్జర్స్‌గా పనిచేయాలని, డ్రగ్స్ రహిత జిల్లాగా మార్చేందుకు ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలని ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి, ఎస్పీ యోగేష్ గౌతమ్ పిలుపునిచ్చారు. గురువారం డ్రగ్స్ ఫ్రీ తెలంగాణ కోసం విద్యార్థి సేన ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో విద్యార్థులతో విద్యార్థి మహా ర్యాలీ నిర్వహించారు. వారు ముఖ్యఅతిథిగా హాజరై జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఎస్పీ మాట్లాడుతూ.. గంజాయి డ్రగ్స్ వంటి మత్తు పదార్థాల బారిన పడితే భవిష్యత్ అంధకారమవుతుందని, యువత భవిష్యత్తు కోసం అందరం కలిసికట్టుగా పోరాడాలని పోలీస్ విభాగం మాదకద్రవ్యాల వ్యాప్తిని అరికట్టడంలో కఠిన చర్యలు తీసుకుంటుందన్నారు. ఎవరైనా డ్రగ్స్ బారిన పడిన, రవాణా చేస్తున్న, అమ్మిన అట్టి వ్యక్తుల సమాచారం లోకల్ పోలీసులకు లేదా డయల్ 100 కి లేదా 1908 టోల్ ఫ్రీ నెంబర్లకు సమాచారం ఇవ్వాలన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం డ్రగ్స్‌పై కఠినంగా పనిచేస్తుందని, చట్టపరమైన చర్యలతో పాటు ప్రజల్లో చైతన్యం కలిగించడమే ముఖ్య లక్ష్యం అని, ఇలాంటి విద్యార్థి ర్యాలీలు సమాజంలో మార్పు తీసుకొస్తాయని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ మాదకద్రవ్యాలకు దూరంగా ఉండి డ్రగ్స్ ఫ్రీ తెలంగాణ కొరకు అందరు పాటుపడాలని ఎమ్మెల్యే కోరారు. ఈమేరకు విద్యార్థులు పోస్టర్లు ప్లకార్డులు నినాదాలతో ర్యాలీ నిర్వహించారు. సిఐ శివ శంకర్,ఎస్‌ఐ రాముడు, ఎకై ్సజ్ సీఐ అనంతయ్య తదితరులు పాల్గొన్నారు.
గాంధీ ఆశయాలను కొనసాగించాలి
నారాయణపేట టౌన్: మహాత్మాగాంధీ ఆశయాలు కొనసాగించాలని ఎమ్మెల్యే పర్ణికారెడ్డి సూచించారు. గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్, గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ స్వర్ణోత్సవాలలో భాగంగా లక్ష గాంధీజీ విగ్రహాల ప్రతిష్టాపన గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు కార్యక్రమానికి సంబంధించిన వాల్ పోస్టర్‌ను ఎమ్మెల్యే గురువారం ఆవిష్కరించారు. గాంధీ విగ్రహాలు గ్రామీణ, పట్టణాల ప్రాంతాలలో ప్రతిష్టించబడి శాంతి, సామరస్య చిహ్నాలుగా నిలిచి గాంధీవాద ఆదర్శాలైనా అంహిస, సత్యం , స్వదేశీలను ప్రజలలోకి ప్రవేశ పెట్టడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్ధేశమని సంస్థ నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో బండి వేణుగోపాల్, నరసింహారావు సగరి, యశ్వంత్ లాండ్గే పాల్గొన్నారు.