
ఇబ్బందిగా ఉంది
మా బాబుకు ఒంట్లో ఆరోగ్యం సరిగా లేక వారం రోజులుగా జనరల్ ఆసుపత్రి చిన్నపిల్లల వార్డులో వైద్యం తీసుకుంటున్నాం. బాబుకు విరోచనాలు అవుతుండడంతో నీటి సదుపాయం లేక తాళం వేసి ఉండడంతో ఆసుపత్రి దిగువ భాగానికి వెళ్లలేక తీవ్ర ఇబ్బందులుపడుతున్నాం. తాగడానికి నీటి సదుపాయం లేదు.. వాడుకోవడానికి నీరు లేకపోవడంతో బయట నుండి నీటిని కొని తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. – ఆనంద, నర్సపూర్, దామరగిద్ద మండలం
ఆస్పత్రికి ఏర్పాటు చేసిన వాటర్ సంపులో మోటార్ చేడిపోవడంతో నీటి ఇబ్బందులు తలెత్తాయి. గురువారం మోటార్ మరమ్మతు చేయించి బిగించాం. నీటి ఇబ్బంది రాకుండా చూస్తాం.
– ఆదిత్య గౌడ్, జిల్లా ఆస్పత్రి వైద్యాధికారి
●