
బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతున్న వారిపై చర్య తీసుకోవాలి
నారాయణపేట: జిల్లాలోని ప్రైవేట్ ఆస్పత్రులను లక్ష్యంగా చేసుకొని కొందరు బ్లాక్ మెయిల్ పర్వాన్ని నడుపుతున్నారని, ఇది తగదని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) జిల్లా అధ్యక్షులు డాక్టర్ మల్లికార్జున్ ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆసుపత్రుల్లో నిబంధనలకు వ్యతిరేకంగా కార్యకలాపాలు జరుగుతున్నాయని అంటూ డబ్బులు ఇవ్వాలని డాక్టర్లను బెదిరిస్తున్నారన్నారన్నారు. ఇటువంటి చర్యలు సమాజంలో విలువలకు తిలోదకాలు ఇచ్చేలా ఉన్నాయన్నారు. బ్లాక్ మెయిల్‌కు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్, ఎస్పీకి ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. సమావేశంలో డీఎంహెచ్‌ఒ జయచంద్రమోహన్, డా.కార్తీక్ గందే, డా. గీతా,డా. విశ్వనాధ్, డా. రంజిత్, డా. ప్రసాద్ శెట్టి,పద్మకళ, డా. మధుసూదన్ రెడ్డి ఉన్నారు.
నేడు గద్వాలకు
కేటీఆర్ రాక
గద్వాల: బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శనివారం గద్వాలకు రానున్నారు. మధ్యాహ్నం 3 గంటకు గద్వాలకు చేరుకుని పట్టణంలో భారీ ర్యాలీ తీసి.. అనంతరం 4 గంటలకు తేరుమైదానంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పాల్గొంటారు.