
యూరియా ఇవ్వరు.. గోస తీర్చరు!
మరికల్/ధన్వాడ: మండలంలోని తీలేర్ సింగిల్ విండో సొసైటీ వద్దకు గురువారం తెల్లవారుజాము 5 గంటల నుంచి రైతులు బారులు తీరారు. 900 బస్తాల యూరియా రావడంతో అంతవరకే టోకన్లు ఇచ్చి బంద్ చేయడంతో అక్కడే ఉన్నా వందలాంది మంది రైతులకు ఆగ్రహంతో రోడ్డెక్కి రాస్తోరోకో నిర్వహించారు. దీంతో కిలోమీటర్ మేర వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఘటన స్థలానికి చేరుకున్న సీఐ రాజేందర్‌రెడ్డి, ఎస్‌ఐ రాము రైతులతో మాట్లాడడంతో రాస్తారోకో విరమింపజేశారు. అనంతరం సీఐ, ఎస్‌ఐ రైతుల ఆధార్‌కార్డులు పరిశీలించి ఈ నెల 6న పంపిణీ చేసే యూరియా కోసం రైతుల బొటన వేలిపై ఇంకు అంటించి టోకన్లు అందజేశారు.
సృహాతప్పి పడిపోయిన వృద్ధులు
తీలేర్ సొసైటీ వద్ద యూరియా కోసం క్యూలైన్‌లో నిలబడిన వృద్ధులు మణెమ్మ, కుర్మన్న సృహ తప్పి కింద పడిపోయారు. గమనించిన తోటి రైతులు వారిరి పక్కకు కూర్చొబెట్టి నీళ్లు తాగించారు. అనంతరం పోలీసులు వారిని 108 అంబులైన్స్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బీఆర్‌ఎస్ నాయకులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వృద్ధులను పరామర్శించారు.
ఆరోపణలు తిప్పికొట్టండి
యూరియా దొరకని రైతులకు టోకన్లు జారీ చేయాలని దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్‌రెడ్డి పోలీసులకు సూచించారు. గురువారం తీలేర్ సొసైటీ వద్దకు వచ్చిన ఎమ్మెల్యే యూరియా పంపిణీపై సీఐ రాజేందర్‌రెడ్డితో ఆరా తీశారు. ప్రతిపక్షాలు యూరియా కొరతపై అపోహాలు సృష్టిస్తున్నారని, ఈ విషయంలో పోలీసులు శాంతియుత వాతవారణంలో యూరియా పంపిణీకి చర్యలు తీసుకోవాలని సూచించారు.
● ధన్వాడ మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకర సంఘం వద్ద గురువారం తెల్లవారుజామున 5 గంటల నుంచే రైతులు బారులు తీరారు. కేవలం 300 సంచుల యూరియా రావడంతో.. ఒక్కో రైతుకు రెండు నుంచి మూడు బ్యాగులు మాత్రమే అందజేస్తున్నారు. తిండి తిప్పలు లేకుండా ఉదయం నుంచి లైన్‌లో నిల్చున్న రైతులకు మాజీ ఎంపీటీసీ గౌని శ్రీనివాసులు పండ్లు, వాటర్ పాకెట్లు పంపిణీ చేశారు.

యూరియా ఇవ్వరు.. గోస తీర్చరు!

యూరియా ఇవ్వరు.. గోస తీర్చరు!