లింగ వివక్ష లేని సమాజాన్ని నిర్మిద్దాం | - | Sakshi
Sakshi News home page

లింగ వివక్ష లేని సమాజాన్ని నిర్మిద్దాం

Sep 5 2025 11:48 AM | Updated on Sep 5 2025 11:48 AM

లింగ

లింగ వివక్ష లేని సమాజాన్ని నిర్మిద్దాం

నారాయణపేట టౌన్‌: లింగ వివక్షత లేని సమాజాన్ని నిర్మిద్దామని స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌, జిల్లా సంక్షేమాధికారి రాంజేంద్రగౌడ్‌ అన్నారు. మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ జిల్లా మహిళా సాధికారత కేంద్రం ఆధ్వర్యంలో ఆదర్శ కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సమాజంలో లింగ సమానత్వం, వివక్ష వంటి అంశాలపై అవగాహన కలిగి ఉండడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. అందరికీ సమానమైనా హక్కులు భారత రాజ్యాగం కల్పించిందన్నారు. అనంతరం చైల్డ్‌ వెల్ఫేర్‌ కమిటీ సభ్యులు యాదయ్య బాలల హక్కులు, చట్టాల గురించి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో జిల్లా ప్రాజెక్ట్‌ అసోసియేట్‌ నరేష్‌ అధ్యాపకులు శ్రీకాంత్‌, రమణ, జిల్లా మహిళా సాధికారత కేంద్రం కో ఆర్డినేటర్‌ నర్సిములు, జెండర్‌ స్పెషలిస్ట్‌ అనిత, భారతి, కమ్యూనిటీ ఎడ్యుకేటర్‌ లక్ష్మీకాంత్‌ తదితరులు పాల్గొన్నారు.

ఇళ్ల నిర్మాణంలో వేగం పెంచాలి

కొత్తపల్లి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని పీడీ శంకర్‌ నాయక్‌ సూచించారు. మండలంలోని భూనీడు గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఇళ్లను గురువారం ఎంపీడీఓ కృష్ణారావ్‌తో కలిసి పరిశీలించారు. గ్రామానికి మొదటి విడతలో 43 ఇళ్లు మంజూరు కాగా 31 మంది లబ్ధిదారులు నిర్మాణాలను ప్రారంభించారు. ఇందులో 8 మందికి మొదటి విడత బిల్లును వ్యక్తిగత ఖాతాలో జమ చేసినట్లు తెలిపారు. ఇళ్ల నిర్మాణానికి అవసరమయ్యే ఇసుక, కాంక్రీటు, స్టీల్‌ అందేలా చర్యలు తీసుకోవాలని పంచాయతీ కార్యదర్శులకు సూచించారు. కార్యక్రమంలో హౌసింగ్‌ ఏఈ శాంత కుమార్‌, పంచాయతీ కార్యదర్శి తిరుపతి గ్రామస్తులు పాల్గొన్నారు.

అవినీతిని నిగ్గుతేల్చేందుకే సీబీఐ విచారణ: మంత్రి

స్టేషన్‌ మహబూబ్‌నగర్‌: కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన ప్రజాధనం దుర్వినియోగం, అవినీతిని నిగ్గుతేల్చేందుకే సీబీఐ విచారణ కోరినట్లు రాష్ట్ర పశుసంవర్ధక, క్రీడలశాఖ మంతి వాకిటి శ్రీహరి అన్నారు. జిల్లాకేంద్రంలోని కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో గురువారం ఆయన ఎమ్మెల్యేలతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ మధ్య చీకటి ఒప్పందమని, చేతగాకనే కాళేశ్వరంను సీబీఐ విచారణకు ఇచ్చారని ఎంపీ డీకే అరుణ అనడం అర్థరహితమన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఘోష్‌ కమిషన్‌తో సమగ్ర విచారణ, నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ నివేదిక, విజిలెన్స్‌ కమిషన్‌పై అసెంబ్లీలో చర్చ పెట్టిన తర్వాత అందరి సమ్మతితో సీబీఐకు అప్పగించినట్లు తెలిపారు. బీఆర్‌ఎస్‌, బీజేపీల బంధం ఎలాంటిదో పార్లమెంట్‌ ఎన్నికల్లో చూశామన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం నూటికి నూరుశాతం కాళేశ్వరంలో జరిగిన అవినీతిని కూకటివేళ్లతో బయటకు తీస్తుందన్నారు.

లింగ వివక్ష లేని సమాజాన్ని నిర్మిద్దాం 
1
1/1

లింగ వివక్ష లేని సమాజాన్ని నిర్మిద్దాం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement