
అనుమానాలెన్నో..?
వాతావరణం
రోజంతా ఆకాశం మేఘావృతమైఉంటుంది. మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉంది.
ఈ ఫొటోలో కనిపిస్తున్న వ్యక్తి బండ్రవల్లికి చెందిన రైతు రాములు. ఇతను కోయిల్‌సాగర్ ఆయకట్టు కింద పది ఎకరాల్లో వరి సాగు చేశాడు. 25 బస్తాల యూరియా అవసరం ఉండగా.. తీలేరు సొసైటీకి ఇప్పటివరకు ఆరుసార్లు వచ్చాడు. కానీ, టోకెన్ మాత్రం దొరకలేదు. ఈక్రమంలో యూరియా అయిపోయిందంటూ చెబుతుండడంపై ఆందోళన వ్యక్తం చేశాడు. ప్రభుత్వం స్పందించి తమకు యూరియా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరాడు.
నారాయణపేట: రైతులకు యూరియా కష్టాలు తప్పడం లేదు. గంటల తరబడి నిరీక్షిస్తు న్నా.. యూరియా దొరక్క రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పీఏసీఎస్‌ల వద్ద పడిగాపులు గాసిన క్యూలో వారి లైన్ వచ్చేసరికి యూరియా దొరకకా వెనుదిరుగాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి. యూరియా వచ్చిందనే తెలిస్తే చాలు రైతులు ఒక్కసారిగా అగ్రోస్, పీఏసీఎస్‌ల వద్దకు పరుగులు తీస్తున్నారు. రోజుల తరబడి ఎండనకా.. వాననకా ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొనగా.. కొన్ని చోట్ల ఆగ్రహం కట్టలు తెంచుకొని రైతులు ఆందోళనకు దిగుతున్నారు.
సరిహద్దు మండలాల నుంచి
నారాయణపేట, మక్తల్, ఊట్కూర్, మాగనూర్, క్రిష్ణ, దామరగిద్ద, మద్దూర్ మండలాలు కర్ణాటకకు సరిహద్దుల్లో ఉన్నాయి. ఇటు తెలంగాణ, ఆటు కర్ణాటక రాష్ట్రాల్లో ఎరువుల ధరల్లో వ్యత్యాసం ఉండడంతో అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటూ అక్రమ రవాణా జరగుతుండటం ఈ ప్రాంతంలో పరిపాటే. ధరల్లో వ్యత్యాసం కారణంగా కర్ణాటకకు తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్న ఘటనలున్నాయి. ఈ నేపథ్యంలో సరిహద్దు మండలాల్లో సాగు విస్తీర్ణం పెరగకపోయినా యూరియా విక్రయాలు అధికంగా కావడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
రైతులకు తప్పని నిరీక్షణ
జిల్లాలోని పీఏసీఎస్‌కు యూరియా వచ్చిందంటే చాలు తెల్లారేసరికి రైతులు తమ పట్టా పాసుపుస్తకాలను పట్టుకొని క్యూలో గంటల తరబడి నిల్చుంటున్నారు. ఓ వైపు యూరియా అవసరమైన మేర ఉందని వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నా.. మరో వైపు యూరియా కోసం రైతులు పడుతున్న పాట్లు అన్ని ఇన్ని కావు. ఒకానొక సమయంలో అధికారులతో రైతులు వాగ్వాదానికి దిగుతున్నారు.
4 లక్షల ఎకరాల్లో పంటల సాగు
జిల్లాలో వానాకాలం సీజన్‌లో వివిధ పంటలు 4 లక్షల ఎకరాలు సాగు అయ్యాయని అధికారులు చెబుతున్నారు. అందులో 1.76 లక్షల ఎకరాలు వరి, 70 వేల ఎకరాలు కంది, 1.80 లక్షల ఎకరాల పత్తి, మిగతా పంటలు మరో 15 వేలు ఉండొచ్చు. ఈసారి మొత్తం 10 వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరముందని ముందుగా వ్యవసాయ శాఖ అంచనా వేసినప్పటికీ.. అంతకు మించి 15,031 మెట్రిక్ టన్నుల యూరియా పంపిణీ కావడం గమనార్హం.
జూరాలకు పెరుగుతున్న వరద
జూరాల జలాశయానికి ఎగువ నుంచి వస్తున్న వరద శనివారం 2.10 లక్షల క్యూసెక్కులకు పెరిగింది.
–8లో u
5వేల మె.టన్నులుఅధికంగా విక్రయాలు
కర్ణాటక సరిహద్దుల్లో ఉన్న మండలాల్లో యూరియా విక్రయాలు ఈ సీజనులో గణనీయంగా పెరగడంతో వ్యవసాయ శాఖ అధికారుల్లో పలు అనుమానాలకు తావిస్తోంది. గతేడాది వానాకాలం సీజనుతో పోలిస్తే ఈ ఏడాది 5 వేల మెట్రిక్ టన్నులు అధికంగా విక్రయాలు జరిగాయి. గతేడాదితో పోలిస్తే సాగు విస్తీర్ణం ఏమైనా రెట్టింపు అయ్యిందంటే కాలేదు. వరి సాగు మాత్రం ఈ ఏడాది 10 వేల ఎకరాలకు అధికంగా అయ్యే అవకాశం ఉందని వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. మిగతా పంటలు గతేడాది స్థాయిలో సాగు చేసినట్లు లెక్కలు చెబుతున్నాయి.
యూరియా విక్రయాలుగణనీయంగా పెరగడంపై సందిగ్ధం
జిల్లాకు అంచనా 10వేల మెట్రిక్ టన్నులు..
ఇప్పటివరకు పంపిణీ చేసింది 15,060 మెట్రిక్ టన్నులు
సరిపడా యూరియా దొరక్క రైతుల అవస్థలు
సరిహద్దు రాష్ట్రం కర్ణాటకకు అక్రమంగా తరలిస్తుండగా ఇటీవల పట్టివేత

అనుమానాలెన్నో..?