
ఆస్పత్రి నిర్మాణ పనుల్లో వేగం పెంచాలి
మక్తల్/కృష్ణా: పట్టణ కేంద్రంలోని 150 పడకల ఆస్పత్రి, కృష్ణా మండల కేంద్రంలోని ఆస్పత్రి నిర్మాణ పనుల్లో పెంచాలని కలెక్టర్ సిక్తాపట్నాయాక్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన పనులు ఆమె ఆకస్మికంగా పరిశీలించారు. నియోజకవర్గ కేంద్రంలోని ఆస్పత్రి నిర్మాణం కోసం రూ.34 కోట్లు, కృష్ణా ఆస్పత్రి కోసం రూ.1.56 కోట్లు ప్రభుత్వం కేటాయించిందని, నాణ్యత విషయంలో రాజీ పడొద్దని కాంట్రాక్టర్‌కు సూచించారు. మెడికల్ ఆఫీసర్, స్టాఫ్ గదులు, ఫార్మసీ, ఇమ్యూనైజేషన్ గదులను వెంటనే పూర్తి చేయాలన్నారు. అదే విధంగా కృష్ణా మండలంలోని ముడుమాల్ గ్రామంలో జింకల పార్కు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వ స్థలాన్ని అటవీ శాఖ అప్పగించారా అని రెవెన్యూ అధికారులను ప్రశ్నించారు. అందుకు కావల్సిన అన్ని రికార్డులను వేగంగా అటవీ అధికారులకు అప్పగించాలన్నారు. కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ ప్రణయ్‌కుమార్, టీజీఎస్‌ఐడీసీ ఈఈ వేణుగోపాల్, డీఈ కృష్ణమూర్తి, ఏఈ సాయిమురారి, తహసీల్దార్లు సతీష్‌కుమార్, శ్రీనివాస్ ఎంపీడీఓ రమేష్‌కుమార్, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యం వద్దు
నారాయణపేట రూరల్: జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి, నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశించారు. టీజీఎంఎస్‌ఐడీసీ ప్రాజెక్టు పరిధిలో రూ.26 కోట్ల వ్యయంతో మండలంలోని అప్పక్‌పల్లి సమీపంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాల, జిల్లా ఆస్పత్రి పక్కన కొనసాగుతున్న నర్సింగ్ కాలేజీ, రూ.40 కోట్ల నిధులతో చేపట్టనున్న ఎంసీహెచ్ (మెటర్నిటీ చైల్డ్ హెల్త్) సెంటర్ పనులను మంగళవారం కలెక్టర్ పరిశీలించారు. నర్సింగ్ కాలేజీ పరిసరాల్లో సర్వే చేసి, స్థలం కబ్జాకు గురి కాకుండా చూడాలని తహసీల్దార్ అమరేంద్రకృష్ణను ఆదేశించారు. మెడికల్ కళాశాలలో మౌలిక వసతులు కల్పిస్తామని తెలిపారు. ఆస్పత్రికి వచ్చే రోగులను దృష్టిలో ఉంచుకొని బస్సు సౌకర్యం కొనసాగించాలని డిపో మేనేజర్ లావణ్యకు సూచించారు. సింగారం క్రాస్ రోడ్డులో రూ.8.50 కోట్లతో చేపపడుతున్న హ్యాండ్‌లూమ్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్‌ను కలెక్టర్ పరిశీలించారు. అదేవిధంగా సెంటర్ చుట్టూ ప్రహరీ నిర్మాణం, సీసీ రహదారి నిర్మాణం, టాయిలెట్ బ్లాక్ పనుల కోసం అదనంగా రూ.4 కోట్లు మంజూరయ్యాయని తెలిపారు. కార్యక్రమంలో మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సంతోష్‌కుమార్
కలెక్టర్ సిక్తా పట్నాయక్