
100 శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేయాలి
మద్దూరు: పీహెచ్‌సీ పరిధిలోని గ్రామాల్లో చిన్నారులకు వ్యాక్సినేషన్ కార్యక్రమం వంద శాతం పూర్తి చేయాలని డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌ఓ శైలజ పల్లె దవాఖానా డాక్టర్లకు, ఏఎన్‌ఎంలకు, ఆశా కార్యకర్తలకు ఆదేశించారు. మంగళవారం మద్దూరు పట్టణంలోని పీహెచ్‌సీలో పీఓ ఎంహెచ్‌ఎన్ డాక్టర్ సుదేశ్నతో కలిసి సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. ఎంసీహెచ్ పోర్టల్‌లో ఎప్పటికప్పుడు నమోదు, తల్లి పాల ప్రాముఖ్యతను ప్రజలకు వివరించాలని, జాతీయ నులిపురుగులు దినోత్సవం తదితర అంశాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో మండల వైద్యాధికారిణి శ్రీలత, సూపర్‌వైజర్లు, హెల్త్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు.