
రాయితీ పరికరాలకు దరఖాస్తుల ఆహ్వానం
కోస్గి: వ్యవసాయ యాంత్రీకరణ పథకంలో భాగంగా ఎస్సీ, ఎస్టీ, మహిళా, చిన్నకారు, సన్నకారు రైతులకు 50 శాతం రాయితీపై రాష్ట్ర ప్రభుత్వం వివిధ రకాల వ్యవసాయ పనిము ట్లు అందజేస్తుందని, కోస్గి, గుండుమాల్, మ ద్దూర్, కొత్తపల్లి మండలాల పరిధిలోని ఆసక్తి ఉన్న రైతులు దరఖాస్తు చేసుకోవాలని ఏడీఏ రామకృష్ణ ఓ ప్రకటనలో కోరారు. నిబంధనల మేరకు అర్హత ఉన్న రైతులకే ఈ రాయితీ పరికరాలు అందజేస్తున్నామని, ఈ నెల 14వ తేదీ వరకు దరఖాస్తు ఫారంతో పాటు ఆధార్ కా ర్డు, భూమి పట్టాపాస్ బుక్, ( కేవలం ట్రాక్టర్ పనిముట్లకు దరఖాస్తు చేసే వారు మాత్రం ట్రాక్టర్ ఆర్సీ) జిరాక్స్‌లను ఆయా మండలాల వ్యవసాయ శాఖ అధికారులు, ఏఈఓలకు అందజేయాలన్నారు. రాయితీపై బ్యాటరీ స్పేయర్లు, పవర్ స్పేయర్లు, రోటో వేటర్స్, కల్టీవేటర్లు, కేజీ వీల్స్, బండ్ ఫార్మర్ అందుబాటులో ఉన్నాయన్నారు.
చట్టాలపై అవగాహన తప్పనిసరి
నారాయణపేట రూరల్: విద్యార్థి దశ నుంచే చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ సురేష్ తెలిపారు. జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో మండలంలోని బొమ్మన్‌పాడు ప్రభుత్వ పాఠశాలలో మంగళవారం చట్టాలు, ర్యాగింగ్ ముప్పు నివారణ గూర్చి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ర్యాగింగ్ చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలన్నారు. ర్యాగింగ్ చేసినా, సహకరించిన వారికి సమాన శిక్ష ఉంటుందని తెలిపారు. సీనియర్ విద్యార్థులు కొత్తగా వచ్చిన విద్యార్థులకు మనస్థాపం కలిగించే రీతిలో ప్రవర్తించరాదని, బాల్య వివాహాలు, మానసికంగా, శారీరకంగా మాటలతో హింసించడం, విద్యార్థిని, విద్యార్థులను ప్రేమ పేరుతో వేధించడం, అవమాన పర్చడం వంటివి నేరంగా పరిగణించి ఆరునెలల జైలు శిక్షతో రూ.వేయి జరిమానా విధించే అవకాశం ఉందన్నారు. టోల్ ఫ్రీ హెల్ప్‌లైన్ 18001805522 కి సంప్రదించాలని తెలిపారు. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, రూ.మూడు లక్షల లోపు ఆదాయం కలిగిన బీసీలకు ఉచిత న్యాయ సేవలు అందుతాయన్నారు. న్యాయ సలహాల కోసం 15100 నంబర్‌కు ఫోన్ చేసి సమస్యను చెప్తే పరిష్కరిస్తామని తెలిపారు. కార్యక్రమంలో లక్ష్మీపతిగౌడ్, పంచాయతీ కా ర్యదర్శి వేణుగోపాల్, అనిల్, కుర్మన్న, మల్లికా ర్జున్, కృష్ణవేణి, చంద్రకళ, ఉపాధ్యాయులు, పోలీస్ అధికారులు, విద్యార్ధులు పాల్గొన్నారు.
పేట వాసులకు కొండా లక్ష్మణ్ బాపూజీ అవార్డు
నారాయణపేట రూరల్: చేనేత రంగంలో అందించే కొండా లక్ష్మణ్ బాపూజీ అవార్డులు ఈ ఏడాదికి గాను నారాయణపేట జిల్లావాసులను వరించాయి. సాంప్రదాయ కాటన్ చీరల నేత విభాగంలో మండలంలోని చిన్నజట్రం గ్రామానికి చెందిన చేనేత కార్మికుడు జన్ను ఆంజనేయులు, పట్టు శాలువా డిజైనర్ విభాగంలో మండలంలోని కోటకొండకు చెందిన యంగల్ ఆంజనేయులు అవార్డు దక్కించుకున్నాడు. అదే గ్రామానికి చెందిన మాస్టర్ వీవర్ రఘురాములు పట్టు వస్త్రంపై 33 జిల్లాలతో కూడిన తెలంగాణ పటానికి ఎడమ వైపు సీఎం రేవంత్రెడ్డి చిత్రం, కుడి వైపు ఆరు గ్యారంటీల అమలుకు సంబంధించి మగ్గంపై నేసినందుకు అవార్డు పొందినాడు. ఈ మేరకు రాష్ట్ర స్థాయి లో అందించే ఈ అవార్డు కింద ఒక్కొక్కరికి రూ. 25వేల నగదు బహుమతిని అందిస్తారు. ఈ నెల 7న హైదరాబాద్ నెక్లెస్ రోడ్డు పీపుల్ ప్లాజాలో జరిగే జాతీయ చేనేత దినోత్సవ వేడుకల్లో అవార్డులు అందించనున్నారు. ఈ మేరకు ఆ శాఖ కమిషనర్ బి.శ్రీనివాస్‌రెడ్డి వారిని ఆహ్వానిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
పెసర క్వింటాల్‌కు రూ.8,419
నారాయణపేట: స్థానిక వ్యవసాయ మార్కెట్‌లో మంగళవారం పెసర క్వింటాల్‌కు గరిష్టంగా రూ.8,419, కనిష్టంగా రూ.5,909 పలికింది. వ్యాపారస్తులు పోటీ పడి మార్కెట్‌కు వచ్చిన 254 బస్తాల పెసరను కోనుగోలు చేశారు. గిట్టుబాటు ధరలు వస్తుండడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

రాయితీ పరికరాలకు దరఖాస్తుల ఆహ్వానం