
పీయూలో అధికారుల నియామకం
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీలో ఖాళీగా ఉన్న పలు పోస్టులకు అధికారులను నియమిస్తూ వీసీ శ్రీనివాస్ ఉత్తర్వులిచ్చారు. ఈ మేరకు లా కళాశాల వైస్ ప్రిన్సిపాల్‌గా పొలిటికల్ సైన్స్ సీనియర్ అధ్యాపకులు భూమయ్యను నియమించారు. ఇంజనీరింగ్ కళాశాల వైస్ ప్రిన్సిపాల్‌గా కంప్యూటర్ అప్లికేషన్స్ గౌస్ మోయినోద్దీన్‌ను నియమించారు. పీఆర్వోగా సోషల్ వర్క్ విభాగానికి చెందిన గాలెన్నను నియమించారు. అకాడమిక్ ఆడిట్ సెల్ కోఆర్డినేటర్‌గా రవికుమార్‌ను నియమించారు. తమపై నమ్మకం ఉంచి భాద్యతలను అప్పగించినందుకు అధికారులు వీసీ ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ రమేష్‌బాబు, ఆడిట్‌సెల్ డైరెక్టర్ చంద్రకిరణ్, ప్రిన్సిపాళ్లు, కరుణాకర్‌రెడ్డి, మధుసూదన్‌రెడ్డి, రవికాంత్ తదితరులు పాల్గొన్నారు.