ఆశల వాన! | - | Sakshi
Sakshi News home page

ఆశల వాన!

Jul 28 2025 7:23 AM | Updated on Jul 28 2025 7:23 AM

ఆశల వ

ఆశల వాన!

వారం రోజులుగా కురుస్తున్న వర్షాలు

వివరాలు 8లో u

ఆనందంగా ఉంది..

వర్షాకాలం ప్రారంభమై నెలన్నర గడిచినా పెద్దగా వర్షాలు లేకపోవడంతో బోరుబావుల్లో నీటిమట్టం పెరగలేదు. పంటలు పండుతాయో లేదో అన్న బెంగ ఉండేది. వారం రోజులుగా కురిసిన వర్షాలతో మా ఊరి చెరువు నిండింది. మరో రెండు, మూడు భారీ వర్షాలు పడితే చెరువు అలుగు పారుతుంది. ఆయకట్టు కింద ఉన్న రైతులకు సాగునీరు అందుతుంది. బోరుబావుల్లో నీటిమట్టం పెరుగుతుంది.

– డొల్ల నరేశ్‌, రైతు, మాగనూర్‌

నారాయణపేట: వారం రోజులుగా కురుస్తున్న వర్షాలు రైతుల్లో ఆశలు నింపుతున్నాయి. ఈ ఏడాది వానాకాలం ప్రారంభమైన తర్వాత వర్షాలు అంతంత మాత్రంగానే కురిశాయి. ఈ నెలలో సైతం మూడు వారాలుగా వరుణుడు కరుణించలేదు. ఒక్కానొక దశలో వర్షాల కోసం రైతులు వెయ్యి కళ్లతో ఎదురుచూశారు. పలు గ్రామాల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో జిల్లాలోని 769 చెరువులు, కుంటలతో పాటు భూత్పూర్‌, సంగంబండ రిజర్వాయర్లలోకి నీరు వచ్చి చేరుతుండటంతో రైతుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నెల 27వ తేదీ వరకు జిల్లాలోని 5 మండలాల్లో అత్యధిక వర్షపాతం నమోదు కాగా.. మిగతా మండలాల్లో సాధారణ వర్షపాతమే నమోదైంది. జిల్లావ్యాప్తంగా చూస్తే వర్షపాతం నమోదు సాధారణమేనంటూ అధికారుల గణాంకాలు చెబుతున్నాయి.

మండలాల వారీగా జూలై 27 వరకు

నమోదైన వర్షపాతం ఇలా (మి.మీ.)లలో..

మండలం సాధారణం కురిసింది

దామరగిద్ద 222 300

నారాయణపేట 237 218

ఊట్కూర్‌ 215 282

మాగనూర్‌ 207 222

కృష్ణా 197 227

మక్తల్‌ 183 190

నర్వ 202 226

మరికల్‌ 214 293

ధన్వాడ 235 234

మద్దూర్‌ 194 277

కోస్గి 249 309

గుండుమాల్‌ 222 239

కొత్తపల్లి 194 221

చెరువులు, కుంటలకు చేరుతున్న నీరు

సంగంబండ రిజార్వాయర్‌లో

గేట్లు ఎత్తివేత

ఆయకట్టు రైతుల్లో హర్షాతిరేకాలు

చేపపిల్లలు వదిలేందుకు అనుకూలం..

జిల్లాలోని 641 చెరువుల్లో చేపపిల్లలు వదిలేందుకు అనుకూలంగా మారాయి. గతేడాది వర్షాలు ఆలస్యం కావడంతో పాటు చేపపిల్లల పంపిణీ టెండర్లు సైతం ఆలస్యమయ్యాయి. ఈ ఏడాది చెరువులు, రిజర్వాయర్లలో నీటిశాతం అనుకూలంగా ఉండటంతో త్వరగా టెండర్లు పిలిచి చేపపిల్లలను వదిలితే బాగుంటుందని మత్స్యకారులు అభిప్రాయపడుతున్నారు.

ఆశల వాన! 1
1/1

ఆశల వాన!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement