
‘పోలీస్ యంత్రాంగం సిద్ధంగా ఉండాలి’
మరికల్: రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ ఎప్పుడు ఇచ్చినా సమర్థవంతంగా నిర్వహించేందుకు జిల్లా పోలీస్ యంత్రాంగం సిద్ధంగా ఉండాలని ఎస్పీ యోగేష్‌గౌతమ్ అన్నారు. వార్షిక తనిఖీల్లో భాగంగా శుక్రవారం మరికల్ పోలీస్‌స్టేషన్‌ను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్‌స్టేషన్ పరిసరాలు, వివిధ కేసుల్లో సీజ్ చేసిన వాహనాలను పరిశీలించి మొక్కలు నాటారు. అనంతరం సిబ్బంది యొక్క కిట్ ఆర్టికల్స్, మండలంలో ఎక్కువగా జరిగే కేసులపై ఆరా తీశారు. విలేజ్ పోలీస్ ఆఫీసర్ క్రమం తప్పకుండా తమ గ్రామాన్ని విజిట్ చేయాలని సూచించారు. స్టేషన్‌కు సంబంధించిన రికార్డులు, పెండింగ్ కేసులు, కోర్టు కేసులతో పాటు దర్యాప్తులో ఉన్న కేసుల గురించి ఆరా తీశారు. గ్రామాల్లో చోరీలు జరగకుండా పెట్రోలింగ్ పకడ్బదీంగా నిర్వహించాలని ఆదేశించారు. సిబ్బంది నూతన సాకేతిక వ్యవస్థపై అవగాహన కలిగి ఉండాలన్నారు. సామాజిక అంశాలు, సైబర్ నేరాలు, బాల్యవివాహాల నిర్మూలన, మత్తు పదార్థాల వినియోగంతో కలిగే నష్టాల గురించి ప్రజలకు వివరించాలన్నారు. న్యాయం చేస్తారనే నమ్మకం ఫిర్యాదుదారులకు కల్పించినప్పుడు ప్రజలకు పోలీసులపై గౌరవం పెరుగుతుందన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ లింగయ్య, సీఐ రాజేందర్‌రెడ్డి, ఎస్‌ఐ రాము, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.