
బీజేపీతోనే పేదలకు సంక్షేమం
మరికల్: బీజేపీతోనే పేదలకు సంక్షేమ ఫలాలు అందుతాయని బీజేపీ సీనియర్ నాయకుడు నాగురావు నామాజీ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో నిర్వహించిన స్థానిక సంస్థల ఎన్నికల కార్యశాల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం తీసుకోవాల్సిన చర్యల గురించి కార్యకర్తల నుంచి సలహాలు స్వీకరించారు. అనంతరం నాగురావు నామాజీ మాట్లాడుతూ కాంగ్రెస్, బీఆర్‌ఎస్, ఇతర పార్టీలు ప్రజాధారణ కోల్పోయి దిక్కులేని స్థితిలో ఉన్నాయన్నారు. పదేళ్ల పాలనలో బీఆర్‌ఎస్, 18 నెలల పాలనలో కాంగ్రెస్ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయాయని ఎద్దేవా చేశారు. ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వంలో బీజేపీ దేశవ్యాప్తంగా బలమైన శక్తిగా మారిందన్నారు. స్థానిక ఎన్నికల్లో మండలంలో 11 ఎంపీటీసీలతో పాటు 17 సర్పంచ్‌లను కై వసం చేసుకోవాలని నాయకులకు నాయకులకు దిశానిర్ధేశం చేశారు. కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి నర్సన్‌గౌడ్, మండల అధ్యక్షుడు వేణు, సురేందర్, తిరుపతిరెడ్డి, శ్రీరామ్, మోహన్‌రెడ్డి, వెంకటేష్, రాజేష్, రమేష్ పాల్గొన్నారు.