
‘విద్యార్థినులకు ఇబ్బందులు రానివ్వొద్దు’
ధన్వాడ: మండల కేంద్రంలోని మోడల్ బాలికల హాస్టల్ (కస్తూర్బా గాంధీ టైపు–4) విద్యార్థులను గురువారం రాత్రి స్థానిక కస్తూర్బా గాంధీ పాఠశాలలోని హాస్టల్‌కు తరలించినట్లు అధికారులు తెలిపారు. మోడల్ హాస్టల్‌లో మరుగుదొడ్లు లేక ఇబ్బందులు పడుతన్నామని గురువారం విద్యార్థులు రాస్తారోకో చేసి విషయం తెలిసిందే. దీంతో గురువారం రాత్రి మోడల్ హాస్టల్‌ను ట్రెయినీ కలెక్టర్ ప్రణయ్‌కుమార్ తనిఖీ చేశారు. మోడల్ హాస్టల్‌లో మరమ్మతులు పూర్తి చేసే వరకు విద్యార్థులకు కస్తూర్బా గాంధీ పాఠశాలలో వసతి కల్పించాలని అధికారులను ఆదేశించారు. శుక్రవారం మరోసారి కస్తూర్బా గాంధీ పాఠశాలను పరిశీలించిన ఆయన విద్యార్థులతో మాట్లాడారు. మోడల్ హాస్టల్‌లో కనీస వసతులు కల్పించిన వెంటనే మళ్లీ అక్కడికే తరలిస్తామని, అంత వరకు సర్దుకోవాలని సూచించారు. విద్యార్థినులకు ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని సిబ్బందికి సూచించారు.
కలెక్టర్ ఫండ్ రూ.2.50లక్షలతో..
మోడల్ హాస్టల్‌లో మరుగుదొడ్లు, బాత్‌రూంల్లో లీకేజీల మరమ్మతు పనులు శరవేగంగా పూర్తి చేస్తున్నారు. పనులను పరిశీలించిన డీఈఈ రాములు మాట్లాడుతూ.. కల్టెకర్ ఫండ్ రూ.2.5 లక్షలతో మరమ్మతు పనులు ప్రారంభించామని, నాలుగు రోజుల్లో పూర్తి అవుతాయన్నారు. ఇందుకోసం రూ.20 లక్షలపైనే ఖర్చు అవుతుందని, హాస్టల్‌లో ఉన్న సమస్యలను పరిశీలించి, అంచనా వ్యయాన్ని కలెక్టర్‌కు అందజేస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఏఈ రఘునందన్, సెక్టోరియల్ అధికారులు శ్రీనివాసులు, రాజేంద్రప్రసాద్, ఎస్‌ఓ గంగమ్మలు ఉన్నారు.