పల్లెల స్వచ్ఛతకు నిధులు | - | Sakshi
Sakshi News home page

పల్లెల స్వచ్ఛతకు నిధులు

May 10 2025 12:21 AM | Updated on May 10 2025 12:21 AM

పల్లె

పల్లెల స్వచ్ఛతకు నిధులు

స్వచ్ఛత వైపు అడుగులు..

జిల్లాలో 2025–26 ఆర్థిక సంవత్సరంలో గ్రామాల్లో పారిశుద్ధ్య పనులు చేపేట్టేలా ప్రణాళికలు రూపొందించి పనులు ప్రారంభించాం. ఇందుకోసం రూ.1,043.74 లక్షలను స్వచ్ఛభారత్‌ గ్రామీణ మిషన్‌ కేటాయించింది. ఈ ప్రణాళికలో ప్లాస్టిక్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ యూనిట్లను ఏర్పాటు చేయనున్నాం. అలాగే జిల్లాలో మిగిలిన 79 గ్రామాలను ఓడీఎఫ్‌గా మార్చేందుకు చర్యలు తీసుకుంటున్నాం.

– మొగులయ్య, డీఆర్డీఓ

స్వచ్ఛభారత్‌ మిషన్‌ కింద..

జిల్లాలో స్వచ్ఛభారత్‌ మిషన్‌ కింద వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు సైతం అవకాశం కల్పించాం. అలాగే 7 మండలాల్లో సామూహిక మరుగుదొడ్ల నిర్మాణాలు చేపట్టేందుకు ఆదేశాలు వచ్చాయి.

– మాలిక్‌, జిల్లా మేనేజర్‌, ఎస్‌బీఎం

నర్వ: పల్లెల స్వచ్ఛతపై కేంద్రం ప్రత్యేక దృష్టి సారించింది. ప్రతి పంచాయతీలో స్వచ్ఛభారత్‌ గ్రామీణ మిషన్‌ కింద వివిధ పనులు చేపట్టాలని సూచించింది. ఇందులో భాగంగా జిల్లాకు రూ.1,043.74 లక్షలు కేటాయించి ఆగస్టు 15 వరకు నిర్దేశించిన గ్రామాల్లో లక్ష్యం మేర పనులు పూర్తి చేయాలని ఆదేశించింది. 2025–26 ఆర్థిక సంవత్సరంలో చేపట్టనున్న పనులకు సంబంధించి పల్లెల్లో ఈ నెల 15 వరకు అంచనాల ప్రక్రియ పూర్తి చేస్తారు. ఇందుకోసం అధికారులు క్షేత్రస్థాయిలో సన్నద్ధమవుతున్నారు.

2025–26 వార్షిక ప్రణాళికతో..

జిల్లాలో 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి గ్రామీణాభివృద్ధిశాఖ, స్వచ్ఛభారత్‌ మిషన్‌ ఆధ్వర్యంలో పనులు ప్రారంభించారు. గతంలో జిల్లాలోని 197 గ్రామాలను ఓడీఎఫ్‌గా ప్రకటించగా.. మిగిలిన 79 గ్రామాల్లో వందశాతం మరుగుదొడ్లు నిర్మించుకునేలా చేసి బహిరంగ మల విసర్జన రహిత (ఓడీఎఫ్‌) ప్రాంతాలుగా ప్రకటించేలా చర్యలు తీసుకోనున్నారు. దీంతోపాటు ప్లాస్టిక్‌ భూతాన్ని తరిమికొట్టేందుకు జిల్లాలోని మద్దూరు, మరికల్‌లో ప్లాస్టిక్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ యూనిట్లు నెలకొల్పేందుకు రూ.1.28 కోట్లు కేటాయించనున్నారు. ఇప్పటికే స్థలాల పరిశీలన కూడా అధికారులు పూర్తిచేశారు. దీంతోపాటు వ్యక్తిగత ఇంకుడు గుంతల నిర్మాణాలు ఒక్కో యూనిట్‌కు రూ.14 వేల చొప్పున 248 యూనిట్లను ఏర్పాటు చేయాలని లక్ష్యాన్ని నిర్దేశించారు. ఇందుకుగాను జిల్లాలో ఏడు మండలాలను ఎంపిక చేయగా.. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే పనులు కూడా ప్రారంభించారు. దామరగిద్ద మండలం క్యాతన్‌పల్లి, ధన్వాడ, కోస్గి మండలం అమ్లికుంట, మద్దూర్‌, మక్తల్‌ మండలం మంథన్‌గోడ్‌, నారాయణపేట మండలం కొటకొండ, నర్వలో సామూహిక మరుగుదొడ్ల నిర్మాణాలు ఇప్పటికే ప్రారంభించారు. ఒక్కో యూనిట్‌కు రూ.2.10 లక్షలు చొప్పున నిధులు కేటాయించారు.

ఎస్‌బీఎం, పంచాయతీ నిధులతో..

సామూహిక మరుగుదొడ్డి సాధారణ రకం నిర్మాణానికి రూ.3 లక్షలు ఖర్చవుతుండగా.. ఇందులో ఎస్‌బీఎం రూ.2.10 లక్షలు కేటాయిస్తుండగా, మిగిలిన డబ్బులను గ్రామపంచాయతీ లేదా సీఎస్‌ఆర్‌ నిధుల నుంచి వెచ్చిస్తారు. ఇక్కడ వ్యాపారం చేసుకునేందుకు షట్టర్‌ నిర్మాణానికిగాను రూ.5 లక్షలు కేటాయిస్తుండగా.. ఇందులో ఎస్‌బీఎం రూ.3 లక్షలు, జీపీ ఫండ్స్‌ నుంచి రూ.2 లక్షలు వెచ్చించాలని ఆదేశాల్లో పేర్కొన్నారు.

యూనిట్ల వారీగా నిధుల కేటాయింపు ఇలా..

కోటకొండలో నిర్మాణంలో ఉన్న

సామూహిక మరుగుదొడ్లు

యూనిట్‌ లక్ష్యం మంజూరైన నిధులు

(రూ.లక్షల్లో..)

వ్యక్తిగత మరుగుదొడ్లు 4,443 533.16

సామూహిక మరుగుదొడ్లు 448 27.00

వ్యక్తిగత ఇంకుడు గుంతలు 3,472 225.70

సామూహిక ఇంకుడు గుంతలు 219 257.88

స్వచ్ఛభారత్‌ గ్రామీణ మిషన్‌ కింద జిల్లాకు రూ.1,043.74 లక్షలు మంజూరు

2 ప్లాస్టిక్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌

యూనిట్ల ఏర్పాటు

7 మండలాల్లో సామూహిక

మరుగుదొడ్ల నిర్మాణానికి శ్రీకారం

పరిశీలన.. స్థలాల ఎంపిక ప్రక్రియ పూర్తి..

స్వచ్ఛభారత్‌ మిషన్‌కు సంబంధించిన పనుల వివరాలను ఆయా పంచాయతీల్లో తెలియజేస్తారు. ప్రత్యేక అధికారులు, పంచాయతీ కార్యదర్శులు ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. గ్రామాల్లో ఎక్కడెక్కడ సామూహిక ఇంకుడు గుంతలు, మరుగుదొడ్లు అవసరమో పరిశీలించి స్థలాలు ఎంపిక చేస్తారు. దీంతోపాటు జిల్లాలో ఓడీఎఫ్‌ కాని గ్రామాలను ఎంపిక చేసి వ్యక్తిగత మరుగుదొడ్లు, ఇంకుడుగుంతల నిర్మాణాలకు ఆసక్తి చూపే వారి నుంచి అధికారులు దరఖాస్తులు స్వీకరిస్తారు. అలాగే పంచాయతీల్లో సామూహిక పారిశుద్ధ్య సమూహాలు, ప్లాస్టిక్‌ వ్యర్థాల నిర్వహణ యూనిట్లు, సామూహిక ఇంకుడుగుంతలు, కంపోస్టు షెడ్లు వంటివి నిర్మించనున్నారు.

పల్లెల స్వచ్ఛతకు నిధులు 1
1/2

పల్లెల స్వచ్ఛతకు నిధులు

పల్లెల స్వచ్ఛతకు నిధులు 2
2/2

పల్లెల స్వచ్ఛతకు నిధులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement