
టీనేజ్ ప్రేమలు
ఆన్‌లైన్ వేదికలు..
సోషల్ మీడియా ద్వారా కొత్త పరిచయాలు
● మైనర్ ఏజ్‌లోనే పెళ్లిళ్లు
చేసుకుంటున్న వైనం
● ఆన్‌లైన్, మొబైల్ వినియోగంపై
అప్రమత్తంగా ఉండాలంటున్న
చైల్డ్ సేఫ్టీ అధికారులు
● ఉమ్మడి జిల్లావ్యాప్తంగా
పెరుగుతున్న ఘటనలు
‘నాగర్‌కర్నూల్ జిల్లాలోని మైనర్ బాలికకు
ఓ యువకుడు ఇన్‌స్ట్రాగామ్ ద్వారా పరిచయం అయ్యాడు. ప్రేమ పేరుతో కొన్నాళ్లుగా చాటింగ్ చేసిన తర్వాత తరచుగా కలుసుకునేవాళ్లు. విషయం తెలిసిన బాలిక తల్లిదండ్రులు ఆ బాలిక మైనర్‌గా ఉండగానే వివాహం జరిపించారు. ఆన్‌లైన్
పరిచయాలు ప్రేమగా మారుతుండటం, మైనర్ ప్రేమల నేపథ్యంలో మైనర్
వివాహాలు చోటుచేసుకుంటున్న
ఘటనలు పెరుగుతున్నాయి.’