
ఉగ్రవాద నిర్మూలనే లక్ష్యం
మరికల్: ఉగ్రవాదాన్ని సమూలంగా నిర్మూలించడమే లక్ష్యంగా మోదీ ప్రభుత్వం పనిచేస్తుందని, ఈక్రమంలోనే సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇవ్వడం వల్లే వంద మందికి పైగా ఉగ్రవాదులను హతమార్చడం జరిగిందని ఎంపీ డీకే అరుణ అన్నారు. ఆదివారం ప్రధాని నరేంద్రమోదీ నిర్వహించిన మన్‌కీ బాత్ కార్యక్రమాన్ని ఆమె మరికల్‌లో వీక్షించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ పహల్గాం దాడి తర్వాత పాకిస్తాన్‌లో దాక్కున్న ఉగ్రవాదుల స్థావరాలపై ప్రతీకార దాడి చేసి విజయం సాధించమన్నారు. సైనికుల విజయానికి మద్దతుగా తీరంగా యాత్ర నిర్వహించామని, ఇందుకు దేశ ప్రజల నుంచి కూడా సంపూర్ణ మద్దతు రావడం హర్షించదగ్గ విషయమన్నారు. భవిష్యత్‌లో భారతదేశంపై ఎక్కడ దాడి జరిగిన ఉగ్రవాదాన్ని పూర్తిగా తుడిచి వేయడం కోసం చేపట్టి ఆపరేషన్ సిందూర్ కొనసాగిస్తామన్నారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు సత్యయాదవ్, నాగురావు, రతంగపాండురెడ్డి, నర్సన్‌గౌడ్, వేణు, తిరుపతిరెడ్డి, భాస్కర్‌రెడ్డి, రాజేష్, శ్రీరామ్, రమేష్, నిఖిల్ పాల్గొన్నారు.