
ప్రభుత్వ పాఠశాలల్లోనే మెరుగైన విద్య
కోస్గి రూరల్: ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యార్థులకు మెరుగైన విద్య అందుతుందని, తాజాగా విద్యార్థులు సాధించిన ర్యాంకులే ఇందుకు నిదర్శనమని బీసీ సంక్షేమ సంఘం నాయకులు అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతూ ఉత్తమ ఫలితాలు సాధించిన పలువురు విద్యార్థులను జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం మండల విద్యా వనరుల కార్యాలయంలో సింగిల్ విండో వైస్ చైర్మన్ వేణుగోపాల్, ఎంఈఓ శంకర్‌నాయక్ సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాలిసెట్‌లో 120 మార్కులకుగాను 112 మార్కులతో పట్టణంలోని నాగసాన్‌పల్లి గ్రామానికి చెందిన విద్యార్థిని ఐశ్వర్య జిల్లా మొదటి ర్యాంకు సాధించిందని తెలిపారు. అలాగే, మహాత్మా జ్యోతిబాపూలే గురుకుల పాఠశాల విద్యార్థి అజయ్‌కుమార్ సైతం పదో తరగతి ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చాడని వారిని పూల మాలలు శాలువాలతో సత్కరించారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం నియోజకవర్గ అధ్యక్షుడు బస్వరాజ్‌యాదవ్, నాయకలు ఓంప్రకాష్ ,గోపాల్‌గౌడ్ , శివకుమార్ ,బాల్‌రాజ్ , రాములునాయక్ తదితరులు ఉన్నారు.