నిధులు లేక నీరసం! | - | Sakshi
Sakshi News home page

నిధులు లేక నీరసం!

May 26 2025 12:25 AM | Updated on May 26 2025 12:25 AM

నిధుల

నిధులు లేక నీరసం!

అప్పులు చేసి నిర్వహణ

చేపడుతున్నాం..

గ్రామ పంచాయతీలో నిధులు లేకపోవంతో నిర్వహణ కష్టంగా మారింది. అత్యవసర పనుల కోసం బయట అప్పులు తెచ్చి చేయిస్తున్నాం. ప్రభుత్వం స్పందించి వెంటనే నిధులు మంజూరు చేయాలి. – శ్రీనివాస్‌రావ్‌,

ఉట్కూర్‌ పంచాయతీ కార్యదర్శి

మా పరిధిలో లేదు..

స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ మా పరిధిలోనిది కాదు. అది ప్రభుత్వ విధానం. ప్రస్తుతం స్థానిక సంస్థలకు కేంద్రం నుంచి వచ్చే ఆర్థిక సంఘం నిధులు విడుదల కావడం లేదు. గ్రామాల్లో పనిచేస్తున్న కార్మికులకు ప్రభుత్వం నెల నెల వేతనాలు చెల్లిస్తుంది.

– సుధాకర్‌రెడ్డి,

ఇన్‌చార్జ్‌ డీపీఓ, నారాయణపేట

మద్దూరు: స్థానిక సంస్థలు నిధులు లేక నీరసించాయి. పంచాయతీలు, మండల, జిల్లా పరిషత్‌ పాలకవర్గాల కాల పరిమితి ముగియడంతో.. కేంద్ర ఆర్థిక సంఘం నిధులను నిలిపివేసింది. రాష్ట్రం కూడా స్థానిక సంస్థలకు నిధులు ఇచ్చే పరిస్థితి లేకపోవడంతో పల్లెల్లో పాలన అస్తవ్యస్థంగా మారింది. జిల్లా, మండల పరిషత్‌ కార్యాలయాల నిర్వహణ కూడా కష్టమవుతోంది. ఇక గ్రామ పంచాయతీల్లో కార్యదర్శులు అప్పు చేసి అత్యవసర పనులు చేయిస్తున్నారు. ప్రభుత్వాల నుంచి వచ్చే కొద్ది పాటి నిధులు ఏ మూలకు సరిపోక ఇబ్బందులు పడుతున్నారు.

అంతటా ప్రత్యేక అధికారుల పాలన

2024 ఫిబ్రవరితో గ్రామ పంచాయతీల్లో పాలక వర్గాల కాల పరిమితి పూర్తయింది. ఆ వెంటనే ఎన్నికలు నిర్వహించాలి. కానీ కొత్తగా వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రత్యేక అధికారుల పాలన పెట్టింది. ఏడాదిన్నర కావస్తున్నా పంచాయతీ ఎన్నికలు నిర్వహించలేదు. ఇక.. మండల, జిల్లా పరిషత్‌ పాలకవర్గాల కాల పరిమితి కూడా 2024 జూలై 5 వ తేదీతో ముగిసింది. దాంతో ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించకపోవడంతో మండల, జిల్లా పరిషత్‌లో ప్రత్యేకాధికారుల పాలన కొనసాగుతోంది.

అప్పుల్లో కార్యదర్శులు

గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు అప్పులు తెచ్చి పనులు చేయిస్తూ ఆ ఊబిలో కూరుకుపోయారు. ఇప్పటి వరకు నిధులు విడుదల కాలేదు. ఇక మండల పరిషత్‌లో అయితే రెండేళ్ల నుంచి ఎంపీడీఓల వాహనాలకు అద్దె చెల్లింపు నిలిచిపోయింది. నెట్‌ బిల్లుతో పాటు విద్యుత్‌ బిల్లులు కూడా చెల్లించడం లేదు. జిల్లా పరిషత్‌లో నిల్వ ఉన్న ఫండ్‌తో కార్యాలయ నిర్వహణ కొనసాగిస్తున్నారు. ఆ ఫండ్‌ అయిపోతే స్టేషనరీకి కూడా ఇబ్బందులు పడే అవకాశాలున్నాయని అధికారులు పేర్కొంటున్నారు.

నిలిచిన ఆర్థిక సంఘం నిధులు..

కేంద్రం నుంచి జిల్లాకు వచ్చే మొత్తం నిధుల్లో 5 శాతం జిల్లా పరిషత్‌కు, 10 శాతం మండల పరిషత్‌కు, 85 శాతం గ్రామ పంచాయతీలకు మంజూరు చేస్తారు. దీంతో ఆయా పాలకవర్గాల్లోని ప్రజాప్రతినిధులు వారి పరిధిలో అభివృద్ధి చేసేందుకు ఆవకాశం ఉండేది. ఆ వచ్చిన నిధుల్లోనే 6 శాతం కార్యాలయ నిర్వహణకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈ 6 శాతం నిధులతో విద్యుత్‌, నెట్‌ బిల్లులు, వాహనాల అద్దె చెల్లింపు, ఇంతర ఖర్చులకు వాడుకునేవారు. కేంద్రం నిధులు నిలిపివేయడంతో ఇప్పుడు ఈ చెల్లింపులన్నీ నిలిచిపోయాయి. ఇదిలాఉండగా, స్థానిక సంస్థలకు కేంద్ర ప్రభుత్వం ఆయా గ్రామాల జనాభాను బట్టి ఆర్థిక సంఘం నిధులను విడుదల చేస్తుంది. కేంద్రం ఇచ్చే నిధులతో పాటు రాష్ట్ర గ్రాంట్‌ కూడా అందులో కలిపే ఇవ్వాలనేది నిబంధన ఉంది. అయితే పాలకవర్గాలు లేకపోవడంతో ఆర్థిక సంఘం నిధులు నిలిపివేసింది.

ఆర్థిక సంఘం నిధులు రాక

స్థానిక సంస్థల్లో పాలన అస్తవ్యస్తం

కార్యాలయాల నిర్వహణ కూడా

కష్టంగానే..

రెండేళ్ల క్రితమే నిలిచిన అధికారుల వాహనాల అద్దె

ఎన్నికలైతేనే పూర్వ వైభవం

స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహిస్తేనే గతంలో మాదిరిగా ఆర్థిక సంఘం నిధులు ప్రతి నెల విడుదలవుతాయి. వాటితో పాలన గాడిన పడుతుంది. ఇదే పరిస్థితి కొనసాగితే మాత్రం గ్రామ, మండల, జిల్లా పరిషత్‌లలో పాలన మరింత అధ్వానంగా మారే పరిస్థితి నెలకొననుంది.

నిధులు లేక నీరసం! 1
1/3

నిధులు లేక నీరసం!

నిధులు లేక నీరసం! 2
2/3

నిధులు లేక నీరసం!

నిధులు లేక నీరసం! 3
3/3

నిధులు లేక నీరసం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement