
రూ.250 దాటడం లేదు..
ఎంత పనిచేసినా రూ.250 కూలి దాటడం లేదు. ప్రభుత్వం రూ.300 ఇస్తామంటున్న ఇక్కడ మాత్రం అలా వస్తలేదు. ఎండలకు భూమి చాలా గట్టిగా ఉండటంతో ఎంత చేసినా పని సాగక తక్కువే వస్తుంది. అసలే కిలోమీటర్ల దూరం నడిచి వెళ్లి పని చేస్తున్నాం. ప్రభుత్వం తాము చేసిన కూలీ పనికి అదనంగా కలిపి ఇచ్చేలా చర్యలు తీసుకోవాలి.
– జగత్యానాయక్,
పున్యానాయక్తండా, నవాబుపేట
పది రోజులుగా పనిలేదు..
నేను ఎండాకాలంలో ఉపాధి హామీ పనులకు వెళ్లాను. రోజుకు రూ.260 చొప్పున డబ్బులు పడ్డాయి. కానీ, పది రోజులుగా గ్రామంలో ఉపాధి పనులు పెట్టడం లేదు. ఏ పని లేక ఖాళీగా ఇంటి వద్దే ఉంటున్నాం. రోజూ పని కల్పిస్తే మాకు ఉపయోగంగా ఉంటుంది.
– లక్ష్మీదేవమ్మ,
మంచాలకట్ట, పెంట్లవెల్లి మండలం
●

రూ.250 దాటడం లేదు..