
గో సంరక్షణ చట్టాన్ని పక్కాగా అమలు చేయాలి
నారాయణపేట రూరల్: గో సంరక్షణ చట్టాన్ని పక్కాగా అమలు చేయాలని విశ్వహిందూ పరిషత్, బజరంగ్దళ్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఎస్‌ఐకి వినతి పత్రం ఆదివారం అందించారు. వీహెచ్‌పీ జిల్లా ప్రధాన కార్యదర్శి కన్నా శివకుమార్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో చట్టవిరుద్ధంగా కొనసాగుతున్న గోవధ శాలలను తక్షణమే మూసివేయాలని, అక్రమంలో ఉన్న గోచార భూములను విముక్తి చేయాలన్నారు. గుర్తింపు పొందిన గోశాలలకు నిధులు కేటాయించాలని, ప్రతి జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో గోశాలలను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. దేవాదాయ శాఖ పరిధిలోని అన్ని దేవాలయాల్లో గోవులను పెంచాలని, గోఆధారిత వ్యవసాయం చేస్తున్న రైతులకు, గోషకులకు తగిన ప్రోత్సాహకాలను అందించాలని కోరారు. బక్రీద్ సందర్భంగా గో రక్షకులు ఆవులను పట్టుకొని పోలీసులకు తెలియజేసే విధంగా గోరక్షకులకు గుర్తింపు పత్రాలు అందించాలని, అన్ని పట్టణాల శివారులలో ప్రత్యేకంగా పోలీస్ చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి అక్రమంగా తరలించబడుతున్న గోసంతతిని రక్షించాలని, సదరు ట్రక్కులను సీజ్ చేసి యజమానులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా సంయోజక్ వడ్ల శ్రావణ్ కుమార్, విజయ్, సందీప్, గోరక్ష ప్రముఖ అనిల్, బాలు పాల్గొన్నారు.
కోయిల్‌సాగర్‌లో
11 అడుగుల నీటిమట్టం
దేవరకద్ర: కోయిల్‌సాగర్ ప్రాజెక్టులో నీటిమట్టం రోజురోజుకూ అడుగంటుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 32.6 అడుగులు కాగా.. ఆదివారం సాయంత్రం వరకు 11 అడుగులకు చేరింది. వానాకాలం తర్వాత యాసంగి పంటలకు నీటిని వదిలే సమయంలో ప్రాజెక్టు నీటిమట్టం 31.6 అడుగులుగా ఉండగా గత నెలలో పంటలు పూర్తయ్యే నాటికి 13.3 అడుగులకు పడిపోయింది. యాసంగి పంటల సాగు పూర్తయిన తర్వాత ప్రాజెక్టులో ఉన్న మూడు పంప్‌హౌస్‌ల నుంచి పంపులను రన్ చేసి తాగునీటి అవసరాలకు సరఫరా చేస్తున్నారు. నారాయణపేట, కొడంగల్, కోస్గి, దేవరకద్ర, మరికల్, ధన్వాడ, మహబూబ్‌నగర్ తదితర ప్రాంతాలకు మిషన్ భగీరథ కింద తాగునీటిని అందిస్తున్నారు. దీంతో గత నెల రోజుల్లో 2.3 అడుగుల నీటిమట్టం తగ్గి 11 అడుగులకు చేరింది. జూన్ నెలలో వర్షాలు సమృద్ధిగా కురిస్తే పెద్దవాగు ద్వారా కోయిల్‌సాగర్‌కు నీరు చేరే అవకాశం ఉంది. అలాగే జూరాలకు వరదలు వస్తే కోయిల్‌సాగర్ ఎత్తిపోతల పథకం పంపులను రన్ చేసి ప్రాజెక్టుకు నీటిని తరలిస్తారు.
ఇంట్రా టూడే లీగ్‌లో రాణించాలి
మహబూబ్‌నగర్ క్రీడలు: ఇంట్రా డిస్ట్రిక్ట్ టూడే లీగ్‌లో క్రీడాకారులు ప్రతిభచాటాలని ఎండీసీఏ ఉపాధ్యక్షులు సురేష్‌కుమార్ అన్నారు. జిల్లాకేంద్రం సమీపంలోని సమర్థ స్కూల్ మైదానంలో అండర్–23 పురుషుల ఇంట్రా డిస్ట్రిక్ట్ టూడే లీగ్‌లో భాగంగా ఆదివారం మహబూబ్‌నగర్– నాగర్‌కర్నూల్ జట్ల మధ్య మ్యాచ్ ప్రారంభమైంది. ఈ సందర్భంగా సురేష్‌కుమార్ క్రీడా జట్లను పరిచయం చేసుకొని మాట్లాడుతూ ఇంట్రా డిస్ట్రిక్ల్ లీగ్ క్రీడాకారులకు మంచి అవకాశమని, సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఎండీసీఏ ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా ఇంట్రా డిస్ట్రిక్ట్ లీగ్‌లకు శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. జట్లకు ఎంపికై న ప్రతి క్రీడాకారుడికి మ్యాచ్‌లు ఆడే అవకాశం లభిస్తుందన్నారు. ఈ అవకాశాన్ని క్రీడాకారులు సద్వినియోగం చేసుకొని తమ వ్యక్తిగత ప్రదర్శనను చాటుకోవాలని పిలుపునిచ్చారు. ఇంట్రా డిస్ట్రిక్ట్ లీగ్‌లో రాణించే క్రీడాకారులకు త్వరలో జరిగే హెచ్‌సీఏ టోర్నమెంట్‌లో పాల్గొనే ఎండీసీఏ జట్లకు ఎంపిక చేస్తామన్నారు. ఇంట్రా డిస్ట్రిక్ట్ లీగ్‌లు ప్రారంభించిన హెచ్‌సీఏ అపెక్స్ కౌన్సిల్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కోచ్‌లు అబ్దుల్లా, ఎండీ మన్నాన్, సీనియర్ క్రీడాకారుడు ఆబెద్ హుస్సేన్ పాల్గొన్నారు.

గో సంరక్షణ చట్టాన్ని పక్కాగా అమలు చేయాలి

గో సంరక్షణ చట్టాన్ని పక్కాగా అమలు చేయాలి