
రూ. 1.80లక్షలు డిపాజిట్ చేశా
సుకన్య సమృద్ధి యోజన పథకం ద్వారా భవిష్యత్‌లో మేలు చేకూరుతుందనే ఆలోచనతో నా ఇద్దరు కూతుర్ల పేర్లపై ఇప్పటి వరకు రూ. 1.80లక్షలు డిపాజిట్ చేశాను. బీపీఎం పాస్‌పుస్తకంపై స్టాంఫ్ వేసి ఇస్తుండటంతో ఎలాంటి అనుమానం రాలేదు. చివరకు మోసపోయానని తెలిసి అధికారులను సంప్రదిస్తే సరైన స్పందన లేదు.
– వాకిటి శ్రీనివాసులు, బాధితుడు
న్యాయం చేయాలి..
మాది నిరుపేద కుటుంబం. నేను నా కూతురు మంజుల పేరుపై సుకన్య సమృద్ధి యోజన పథకం కింద ఐదేళ్ల నుంచి ప్రతినెలా రూ.2వేలు కట్టుకుంటూ వచ్చాను. నాకు కనీసం పాస్‌పుస్తకం కూడా ఇవ్వకుండా బీపీఎం మోసం చేశాడు. అధికారులు స్పందించి మాకు న్యాయం చేయాలి.
– శ్యామలప్ప, బాధితుడు, మాగనూర్
ప్రతినెలా రూ.3వేలు చెల్లించా..
భవిష్యత్‌లో ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయోనని ముందుజాగ్రత్తగా ఆడపిల్ల పేరు మీద సుకన్య సమృద్ధియోజన పథకం కింద డబ్బులు కడుతున్నా. మూడేళ్లుగా ప్రతినెలా రూ.3వేల చొప్పున కట్టుకుంటూ వచ్చాను. ఈ మోసంతో కేంద్ర ప్రభుత్వ పథకాలపై నమ్మకం పోయింది.
– నర్సింగమ్మ, బాధితురాలు, మాగనూర్
విచారిస్తున్నాం..
మాగనూర్ బీపీఎం ధనుంజయ్ సుకన్య సమృద్ధియోజన ఖాతాదారుల నుంచి డబ్బులు సేకరించి.. వారి ఖాతాల్లో జమ చేయకుండా సొంత అవసరాలకు వినియోగించడం వాస్తవం. ఇప్పటికే బీపీఎంను సస్పెన్షన్ చేసి విచారణ చేపట్టాం. ఖాతాదారులు ఎవరూ అధైర్యపడొద్దు. అందరికీ న్యాయం చేస్తాం.
– ప్రశాంతి, ఎంఓ, తపాలాశాఖ
●

రూ. 1.80లక్షలు డిపాజిట్ చేశా

రూ. 1.80లక్షలు డిపాజిట్ చేశా

రూ. 1.80లక్షలు డిపాజిట్ చేశా