ఆప్టా నూతన జిల్లా కార్యవర్గం ఎన్నిక | - | Sakshi
Sakshi News home page

ఆప్టా నూతన జిల్లా కార్యవర్గం ఎన్నిక

May 26 2026 8:12 AM | Updated on May 26 2026 8:12 AM

కర్నూలు సిటీ: ఏపీ ప్రైమరీ టీచర్స్‌ అసోసియేషన్‌(ఆప్టా) జిల్లా నూతన కార్యవర్గం ఎన్నికకు సోమవారం నగరంలోని ఆ సంఘం కార్యాలయంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఆప్టా రాష్ట్ర అధ్యక్షులు కె.ప్రకాష్‌ రావు పాల్గొనగా, నూతన జిల్లా కమిటీ, నూ తన కార్యవర్గం ఎంపికకు రాష్ట్ర నాయకులు బండారు శంకర్‌ ఎన్నికల అధికారిగా వ్యవహారించారు. సమావేశంలో పాల్గొన్న ఆయా మండలాల నాయకులు నూతన కమిటీ జిల్లా అధ్యక్షులుగా ఎం.మధుసూదన్‌ రెడ్డి(కోడుమూరు), జిల్లా ప్రధాన కార్యదర్శిగా డి.గోపాల్‌(కర్నూలు), ఆర్థిక కార్యదర్శిగా ఎన్‌.బి వినోద్‌కుమార్‌(ఆస్పరి)లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వీరితో పాటు అసోసియేట్‌ అధ్యక్షులుగా లక్ష్మా నాయక్‌, ఉపాధ్యక్షులుగా ఎస్‌.ప్రసాద్‌, డి.లక్ష్మన్న, బషీర్‌, పద్మావతిలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఎన్నికల అధికారి బండారు శంకర్‌ వెల్లడించారు.

వాగులోకి దూసుకెళ్లిన కారు

పాణ్యం: మండల కేంద్రమైన పాణ్యంలోని తిరుమల గిరి కాలనీ వద్ద కారు దుర్రవాగులోకి దూసుకెళ్లింది. హైవే పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. హైదరాబాద్‌ నుంచి ప్రొద్దుటూరు వైపు వెళ్తున్న ఓ కారు అదుపు తప్పి వాగులోకి దూసుకెళ్లింది. అదృష్టవశాత్తూ అందులో ఉన్న వారు క్షేమంగా బయటపడ్డారు. సమాచారం తెలుసుకున్న హైవే సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని కారును బయటకు తీశారు.

మధుసూదన్‌ రెడ్డి, గోపాల్‌, వినోద్‌కుమార్‌

Advertisement
 
Advertisement
Advertisement