అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి | - | Sakshi
Sakshi News home page

అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

May 24 2026 1:39 AM | Updated on May 24 2026 1:39 AM

గడ్డివాములు దగ్ధం

బేతంచెర్ల: మండలపరిధిలోని సిమెంట్‌ నగర్‌ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. శనివారం ఈ ఘటన వెలుగుచూసింది. ఏఎస్‌ఐ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల మేరకు.. సిమెంట్‌ నగర్‌ గ్రామానికి చెందిన వడ్ల రామ్మోహన్‌ గురువారం సాయంత్రం ఇంటి నుంచి పని నిమిత్తం బుగ్గానిపల్లె తండాకు వెళ్లాడు. సాయంత్రమైనా ఇంటికి తిరిగి రాలేదు. శనివారం ఉదయం బుగ్గానిపల్లె తండా సమీపంలో ఓ వ్యక్తి మృత దేహం కనిపించడంతో పశువుల కాపర్లు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించి సిమెంట్‌ నగర్‌కు చెందిన వడ్ల రామ్మోహన్‌దిగా గుర్తించారు. వడదెబ్బకారణంగా మృతి చెందాడా లేక మరి ఏదైనా జరిగిందా అన్న అనమానాలు వ్యక్తమవుతున్నాయి. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్‌ఐ వెంకటేశ్వర్లు వెల్లడించారు. మృతుడికి భార్య లక్ష్మితో పాటు ఇద్దరు పిల్లలున్నారు.

అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య

రుద్రవరం: మండలంలోని మాచినేనిపల్లెకు చెందిన మాబ్బాషా(35) అనే వ్యక్తి అప్పుల బాధ తాళలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్‌ఐ జయప్ప తెలిపిన వివరాల మేరకు..మృతుడు మద్యానికి బానిస కావడంతో పాటు ఇంటి నిర్మాణం కోసం చేసిన మొత్తం కలిపి రూ.14లక్షల వరకు అప్పు అయ్యింది. ఆ అప్పు తీర్చలేక ఈ నెల 18వ తేదీన మద్యంలోనే పురుగుల మందు కలుపుకొని తాగాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా కోలుకోలేక మృతి చెందాడు. మృతుడి తల్లి అబ్దుల్‌ బీబీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.

బ్రూసెల్లోసిస్‌ ప్రాణాంతకం కాదు

ఎమ్మిగనూరు సెంట్రల్‌: బ్రూసెల్లోసిస్‌ వ్యాధి ప్రాణాంతకం కాదని, బాధితులు భయపడాల్సిన అవసరం లేదని డీఎస్‌వో డాక్టర్‌ విశేశ్వరరెడ్డి, ఎపడమాలజిస్టు వేణుగోపాల్‌, పీహెచ్‌సీ వైద్యులు హరీష్‌కుమార్‌ పేర్కొన్నారు. శనివారం మండలంలోని బనవాసి ఘనీకృత వీర్య ఆబోతు కేంద్రంలో సిబ్బందికి, కుటుంబసభ్యులకు బ్రూసెల్లోసిస్‌ వ్యాధి స్క్రీనింగ్‌ పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రత్యేక చికిత్స తీసుకోవడం ద్వారా వ్యాధిని దూరం చేయవచ్చన్నారు. కార్యక్రమంలో ఏడీ శ్రీనివాసులరెడ్డి పాల్గొన్నారు.

కోడుమూరు రూరల్‌: గూడూరు మండలం పొన్నకల్‌ గ్రామంలో శుక్రవారం అర్ధరాత్రి నాలుగు గడ్డివాములు దగ్ధమయ్యాయి. బాధితులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన రైతులు బండగట్టు నడిపి మిన్నెల్ల, రాముడు, నాగన్నకు చెందిన నాలుగు గడ్డివాములకు అర్ధరాత్రి దాటిన తర్వాత గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. మంటలు ఎగసిపడుతుండటంతో గ్రామస్తులు గమనించి ఆర్పేందుకు యత్నించినప్పటికీ సాధ్యం కాలేదు. విషయం తెలుసుకున్న కోడుమూరు అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. ప్రమాదంలో నాలుగు గడ్డివాములు పూర్తిగా కాలిపోవడంతో దాదాపు రూ.3లక్షలకు పైగా నష్టం వాటిల్లినట్లు బాధిత రైతులు వాపోయారు. కాగా రెండు వారాల క్రితం ఇదే రైతుల పొలాల్లోని డ్రిప్‌ పైపులు, మోటార్లను గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేయడంతో గ్రామంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గూడూరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.

జై చిరంజీవా!

ఆదోని అర్బన్‌: హనుమంతుడి నామస్మరణతో ఆదోని రణమండలకొండ మారుమోగింది. శనివారం 21 అడుగుల ఏకశిల ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపన కనుల పండువ గాసాగింది. ఓ వైపు పూజలు, అభిషేకాలు.. మరో వైపు హోరెత్తిన భక్తి గీతాలు, మహిళ సంప్రదాయ నృత్యాలు ఆకట్టుకున్నాయి. భక్తజ నంభారీగా తరలివచ్చి వేడుకలో పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement