ఆడపిల్ల పుట్టగానే చాలా మంది తమ పాపకు చేతికి గాజులు, కాళ్లకు కడియాలు, చెవులకు కమ్మలు, ముక్కుకు ముక్కు పుడక పెట్టి అందంగా అలంకరించి చూడచక్కని చిలకమ్మలా చూడాలనుకుంటారు. బుడిబుడి నడకలు వేసే సమయంలో గాజులు, కడియాలు, గజ్జలు కట్టి ఆనందిస్తుంటారు. కొన్నేళ్ల తర్వాత చెవులు, ముక్కు కుట్టించి తమ బాధ్యతను ప్రారంభిస్తారు. చెవులు, ముక్కు కుట్టించడం ఇప్పటికీ సాంప్రదాయంగా భావిస్తున్నారు. ప్రస్తుతం పట్టణాల్లో అధునిక పద్ధతులతో కుట్టిస్తున్నారు. కానీ పల్లెల్లో మాత్రం వరుసకు అమ్మమ్మ మాత్రమే బాలికలకు చెవులు, ముక్కు కుట్టిస్తారు. అందుకు ఆమెకు కానుకగా తాంబూలం, కొబ్బెరిగిన్నె, జాకెట్ పీస్ ఇస్తారు. తుమ్మ ముళ్లుతో ఎంతో చాకచక్యంగా కుట్టడం వీరి పనితనం. ఇక్కడ చిత్రంలో బాలికకు వరుసకు అమ్మమ్మ అయిన మరియమ్మ క్రిష్టిపాడు గ్రామంలో శనివారం చెవులు, మక్కు కుడుతుండగా చిన్నారులు, పెద్దలు ఇలా చూస్తూ ఉండిపోయా రు. ఈ దృశ్యం చూడముచ్చటగా కనిపించింది.
– దొర్నిపాడు
తుమ్మ ముళ్లుతో ముక్కు కుడుతూ..


