దెబ్బతిన్న కేసీ లైనింగ్‌ బెడ్‌ | - | Sakshi
Sakshi News home page

దెబ్బతిన్న కేసీ లైనింగ్‌ బెడ్‌

May 24 2026 1:39 AM | Updated on May 24 2026 1:39 AM

పగిడ్యాల: ఆయకట్టు రైతులకు జీవానాధారమైన కర్నూలు–కడప కాలువ లైనింగ్‌ బెడ్‌ శిథిలమై దెబ్బతింది. పగిడ్యాల నేలగండి సమీపాన మట్టి కట్ట బలహీనపడి నీటి ప్రవాహానికి కొట్టుకుపోయింది. సిమెంట్‌ బెడ్‌ పూర్తిగా దెబ్బతినడంతో ఆయకట్టు రైతులు ఆందోళనకు గురవుతున్నారు. రాబోయే వర్షాకాలంలోగా కేసీ లైనింగ్‌ పనులు చేపట్టకపోతే కాలువ మరింత కోతకు గురై తెగిపోయే ప్రమాదం ఉంది. ఇంకా పగిడ్యాల దుంకుడు తూము (90 కి.మీ. స్లూయిస్‌) నుంచి 91 కి.మీ. స్లూయిస్‌ మధ్యలో కూడా కేసీ లైనింగ్‌ బీటలు వారి దెబ్బతింది. కేసీ కాలువ పరిరక్షణ నిమిత్తం పనిచేసే లష్కర్లు, నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు నిర్లక్ష్యం వహించడం తగదని రైతాంగం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాలువ లైనింగ్‌ దెబ్బతిని ఏళ్లు కావొస్తున్నా మరమ్మతులు చేపట్టకపోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికై నా నీటిపారుదల శాఖ అధికారులు స్పందించి దెబ్బతిన్న కేసీ లైనింగ్‌ బెడ్‌కు పూర్తిస్థాయిలో మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement