వావ్‌.. ఆల్చిప్పలు! | - | Sakshi
Sakshi News home page

వావ్‌.. ఆల్చిప్పలు!

May 24 2026 1:39 AM | Updated on May 24 2026 1:39 AM

దొర్నిపాడు: సముద్రాలు, పెద్ద పెద్ద నదుల్లో కనిపించే ఆల్చిప్పలు కుందూనదిలో దర్శనమిచ్చాయి. వేసవిలో నీటి ప్రవాహం లేకపోవడంతో నది అడుగంటింది. గతంలో ఎన్నడూ లేని విధంగా నది వెంట ఆల్చిప్పలు కుప్పలు కుప్పలుగా ఉన్నాయి. మొలస్కా జాతికి చెందిన ఇవి రెండు గట్టి కర్పరాల (షెల్స్‌) మధ్య తమ శరీరాన్ని రక్షించుకుంటూ జీవిస్తాయి. నీటిలోని నాచు, సూక్ష్మక్రిములను తిని నీటిని శుభ్రంగా ఉంచడంలో కీలక పాత్ర పోషించే ఈ ఆల్చిప్పలను సహజ వడపోత యంత్రాలుగా పిలుస్తారు. శనివారం మండలంలోని క్రిష్టిపాడు గ్రామం వద్ద ఇవి కనిపించడంతో స్థానికులు ఆసక్తిగా తిలకించారు. అలాగే పారే నీటిలో బతికే గుర్రపు డెక్క కూడా నదిలో నీరు లేకపోవడంతో ఎక్కడికక్కడే ఎండిపోయింది.

Advertisement
 
Advertisement
Advertisement