● ఓటర్ల జాబితా సర్వేపై బీఎల్‌ఏలు
నిఘా పెట్టాలి
● మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి
డోన్: వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలకు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు సంసిద్ధులై ఉండాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి పిలుపునిచ్చారు. తన స్వగృహంలో శనివారం డోన్ నియోజకవర్గంలోని ప్యాపిలి పట్టణ, మండల బీఎల్‌ఏలతో బుగ్గన సమావేశమయ్యారు. పార్టీ వ్యవసాయ విభాగం కార్యదర్శి మెట్టు వెంకటేశ్వరరెడ్డి, మీట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ శ్రీరాములు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా బుగ్గన మాట్లాడుతూ.. వచ్చే నెలలో ఎన్నికల కమిషన్ రాష్ట్రంలో సర్ పేరుతో చేపడుతున్న ఓటర్ల సర్వేపై కార్యకర్తలు గట్టి నిఘా ఉంచాలన్నారు. డబుల్ ఓట్లు, మృతుల ఓట్లు తొలగింపు పేరిట అధికార పార్టీ నేతలు సర్వే అధికారులను తప్పుదోవ పట్టించే అవకాశం ఉందన్నారు. అర్హులైన విపక్ష పార్టీ కార్యకర్తల ఓట్ల తొలగించే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ప్రతి ఒక బీఎల్‌ఏ తన పరిధిలోని ఓటర్ల జాబితాను నిరంతరం పరిశీలిస్తుండాలన్నారు. అర్హులైన వారి పేర్లను జాబితా నుంచి తొలగిస్తే పార్టీ నాయకుల దృష్టికి తీసుకురావడంతో పాటు ఫారం 6 ద్వారా తిరిగి వారిని ఓటర్ల జాబితాలో చేర్పించాలన్నారు. అక్రమాలకు పాల్పడడంలో అధికార పార్టీ నేతలు ఆరితేరిన వారనే విషయాన్ని ప్రతి వైఎస్సార్‌సీపీ కార్యకర్తతో పాటు బీఎల్‌ఏలు గుర్తుంచుకోవాలని బుగ్గన హెచ్చరించారు.
కష్టపడి పని చేసే వారికే గుర్తింపు..
సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేసే కార్యకర్తలను, బీఎల్‌ఏలను పార్టీ గుర్తించి భవిష్యత్త్‌లో తగిన విధంగా పదవులతో గౌరవింస్తుదని బుగ్గన అన్నారు. గతంలో ఏవైనా పొరపాట్లు జరిగి ఉంటే వాటిని మర్చిపోయి వైఎస్సార్‌సీపీ బలోపేతానికి కృషి చేయాలని కార్యకర్తలను కోరారు. ఎవైనా సమస్యలు ఉంటే స్థానిక నాయకత్వంతో పాటు తన దృష్టికి తీసుకురావాలన్నారు. సమావేశంలో పార్టీ వ్యవసాయ విభాగం రాష్ట్ర కార్యదర్శి మెట్టు వెంకటేశ్వరరెడ్డి, మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ బొరెడ్డి పుల్లారెడ్డి, సీనియర్ నాయకులు చిన్నపూజర్ల రామచంద్రరెడ్డి, నాగభూషణం రెడ్డి, మండల బూత్ కమిటీ కన్వీనర్ విఘ్నేశ్వరరెడ్డి, గార్లదిన్నె రామసుబ్బయ్య, బాలయ్య, నేరడుజర్ల చంద్రశేఖర్‌రెడ్డి, శ్వామ్‌ప్రసాద్‌రెడ్డి, బోరెడ్డి రామచంద్రారెడ్డి, రామకృష్ణ, కొండయ్య, బోరా మల్లికార్జునరెడ్డి, రజినీకాంత్‌రెడ్డి, రాఘవా, మద్దయ్య, రంగస్వామి, మోహన్, రంగనాయకులు, శ్రీనివాసులు, రసీల్, కొండారెడ్డి, రాచర్ల దివాకర్‌రెడ్డి, కంబగిరి, తులసిరెడ్డి, శంకర్‌రెడ్డి, ఓబుల్‌రెడ్డి యాదవ్, జమాల్, వెంకటేష్ నాయక్, భాస్కర్ నాయుడు, రఘునాథ్‌రెడ్డి, కృష్ణారెడ్డి, చిట్టిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


