మూడో రోజూ రైతులకు అన్నదానం | - | Sakshi
Sakshi News home page

మూడో రోజూ రైతులకు అన్నదానం

May 24 2026 1:27 AM | Updated on May 24 2026 1:27 AM

వైఎస్సార్‌సీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో సీడబ్ల్యూసీ గోడౌన్‌ వద్ద జొన్న విక్రయాల కోసం వచ్చిన రైతన్నలకు మూడో రోజు అన్నదాన కార్యక్రమాన్ని కొనసాగించారు. శనివారం వైఎస్సార్‌సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఇసాక్‌బాషా, జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు గుండం నాగేశ్వరరెడ్డిలు రైతులకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా గుండం నాగేశ్వరరెడ్డి మాట్లాడుతూ.. తిండి తిప్పలు మాని గోదాముల వద్ద బండ్లు నిలుపుకొని ఇబ్బందులు పడుతున్న రైతులను దృష్టిలో ఉంచుకొని జొన్న కొనుగోళ్లు తక్షణమే చేపట్టాలన్నారు. కష్టాల్లో ఉన్న రైతులకు అండగా నిలవడమే తమ పార్టీ ధ్యేయమన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్‌రెడ్డి, జిల్లా కార్యదర్శి సద్జల చంద్రశేఖర్‌రెడ్డి, గోపవరం జయప్రకాష్‌, నారాయణరెడ్డి, మధుసూదన్‌రెడ్డి, సునీల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement